కార్యకర్తను ఓదార్చిన మాజీ ఎమ్మెల్యే సురేందర్
నమస్తే ఇందూర్,ఎల్లారెడ్డి అక్టోబర్ 20
ఎల్లారెడ్డి మండల సాతెల్లి గ్రామ బిఆర్ఎస్ కార్యకర్త పసుపుల దుర్గయ్య సతీమణి పసుపుల పద్మ చెరువులో పడి ప్రమాదవశాత్తు మరణించారు. ఈ విషయం స్థానికులచే సమాచారం అందిన వెంటనే పండగను సైతం లెక్కచేయకుండా బాధలో ఉన్న కార్యకర్త ను ఓదార్చాడానికి ఆ గ్రామానికి చేరుకొని అంత్యక్రియలో పాల్గొన్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ శోకసంద్రంలో మునిగిన ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి, అండగా తానున్నానని భరోసా ఇచ్చారు.మాజీ ఎమ్మెల్యే వెంట మండల బిఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

