కార్యదర్శి తొలగించాలి. గ్రామస్తుల ఆందోళన.
ఇందూరు వార్త / అక్టోబర్ 17/ కోటగిరి,పోతంగల్:
పోతంగల్ జిపి కార్యదర్శి చంద్రకాంత్ ను విధులు నుంచి తొలగించాలని శుక్రవారం చంద్రకాంత్ ను విధులు నుంచి తొలగించాలని గ్రామస్తులు పోతంగల్ మండల కేంద్రంలోని ధర్నా రస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ… కార్యదర్శి వీధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఇనుప సామాన్లను గ్రామంలో పెద్ద మనుషులకు ఎవరికి చెప్పకుండా, అమ్మి వేశారని తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడుపులు ముట్టంది ఏ పని కూడా జరగదని చెప్పకనే చెప్తున్నాడు. అని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని సమస్యలను పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు కాలనీలో రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలతో దోమల పెడితే ఎక్కువగా ఉందని దోమల మందు పిచికారి చేయడం లేదని అన్నారు. గ్రామంలోని ప్రజలు గ్రామ సమస్యలపై గ్రామ సమస్యలను తీర్చమని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదని అంటున్నారు. ఆయనను వెంటనే విధులను నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి ఎంపీడీవో చందర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యను ఉన్నత అధికారులు దృష్టికి తీసుకు వెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఆందోళనలో కల్లూరి హన్మాండ్లు కన్నం పబ్బ శేఖర్, పాగల నవీన్, మధు, హైమద్, గంగాధర్, హనుమంతు, కన్నం రాము, కురుమయ్య, సాంబయ్య, ఎల్లప్ప, నాగయ్య, బండారి రాజు, చెన్నప్ప, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.
