టీబీ రహిత జిల్లాయే లక్ష్యం
. *జిల్లా కలెక్టర్ ప్రావీణ్య.**సంగారెడ్డి జిల్లా/నమస్తే ఇందూర్/మార్చి 24. కే యాదయ్య చీఫ్ బ్యూరో
సంగారెడ్డిలో అవగాహన ర్యాలీతో 100 రోజుల ‘TB ముక్త్ భారత్ అభియాన్ v2.0’ ప్రారంభం
సంగారెడ్డి, లోకల్ టైమ్స్ న్యూస్: మార్చి 24:-
సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి టీబీ రహిత తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పిలుపు నిచ్చారు.ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని
సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి సబ్ సెంటర్ వద్ద మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రావీణ్య జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించడంతో పాటు
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా
100 రోజుల ‘TB ముక్త్ భారత్ అభియాన్ v2.0’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, టీబీ వ్యాధి పూర్తిగా నయం అయ్యే వ్యాధి అని, ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా దీన్ని నిర్మూలించడం సాధ్యమని తెలిపారు. “టీబీ ముక్త్ భారత్” లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు. జిల్లాలో మే 15 వరకు 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో టీబీ అధికంగా ఉన్న ప్రాంతాలను ఇప్పటికే గుర్తించి, ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో ఇంటింటికీ సర్వేలు నిర్వహించి 14 సంవత్సరాల పైబడిన వారితో పాటు గర్భిణీలు, రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు ప్రత్యేకంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆధునిక సాంకేతికతతో కూడిన మొబైల్ ఎక్స్-రే యంత్రాల ద్వారా వెంటనే ఫలితాలు అందజేసి, అవసరమైన వారికి తక్షణమే చికిత్స, ఉచిత మందులు అందజేయడం జరుగుతుందని తెలిపారు.
టీబీ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించాలని, నిర్లక్ష్యం చేయకుండా పూర్తి స్థాయి చికిత్స తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
ఈ ర్యాలీలో విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని టీబీ నివారణపై నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వసంత్ రావు, జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి డాక్టర్ అరుణకుమారి, వైద్య సిబ్బంది, కళాశాలల విద్యార్థులు, ఇతర అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

