తడి హిప్పర్గ గ్రామ సర్పంచ్ గా అశ్విని సుధర్షన్ కంకర్నె బాధ్యతల స్వీకిరణ
నమస్తే ఇందుర్ (న్యూస్)బోధన్ ప్రతినిధి కాంబ్లె మధుకర్. Dec 22
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని తడి హిప్పర్గ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా అశ్విని సుధర్షన్ కంకర్నె. సోమవారం అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు, ఈ ప్రమాణ స్వీకార వేడుకకు గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చారు, ఈ సందర్భంగా అశ్విని సుధర్షన్ కంకర్నె మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో తడి హిప్పర్గ గ్రామంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని. ప్రభుత సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఇంటికి చేరేలా నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశ్విని సుధర్షన్ కంకర్నె,ఉప సర్పంచ్ అంజలి ప్రళద సూర్యవంశీ, గ్రామ ప్రజలు,వార్డ్ నెంబర్లు, సైదాబాయ్. గౌషబీ. అంజలి. అర్చన. ప్రకాష్. విశ్వజిత. రాజు. దొండిబా. లింగ్గురం.రాహుల్.తదితరులు పాల్గొన్నారు,

