నూతన సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం
సంగారెడ్డి డిసెంబర్ 22 చోటకుర్ మండలంలోని పోసాని పల్లి గ్రామంలో నూతన కార్యవర్గం గ్రామపంచాయతీ సర్పంచ్ గా పల్లె రేణుక- బాలరాజ్ ఉప సర్పంచ్ గా రమేష్ మరియు గ్రామ వర్డ్ సబ్యులుగా మెంబర్లు అందరూ కలిసిమెలిసి నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది గ్రామ వర్డ్ నెంబర్ లుగా మన్నే స్థిరవీర్, గొలగారి శాంతమ్మ, చంద్రమ్మ, అదే షేకమ్మ, చిందం విట్టల్, ప్రభాకర్, పల్లె విజయలక్ష్మి అందరూ గ్రామ ప్రజల సమక్షంలో నూతన కార్యవర్గంలో అందరు ఎన్నుకోవడం జరిగిందని గ్రామ సర్పంచ్ పల్లె రేణుక అన్నారు ఈ కార్యక్రమం గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఆధ్వర్యంలో ఊరు పెద్దలు మధ్యలో ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు మన గ్రామ అభివృద్ధి కోసం మేము పాటుపడతామని అభివృద్ధి కోసమే గ్రామ ప్రజలు కూడా మీరు సహకరించారని వారు కోరారు.

