బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్న ఎక్సైజ్ సీఐ ను సస్పెండ్ చేయాలి
సిపిఎం ఆందోల్ డివిజన్ కార్యదర్శి విద్యాసాగర్
ప్రజల ప్రాణాలంటే జోగిపేట మోనార్క్ ఎక్సైజ్ సిఐ కి అంతా చులువనా.?
. సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం అందోల్ డివిజన్ రిపోర్టర్ నాగరాజు నమస్తే ఇండోర్ డిసెంబర్ 26
బెల్టు షాపులు వారు ఇచ్చే మామూళ్లకు ఆశపడి బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్న జోగిపేట ఎక్సైజ్ సీఐ సాగర్ రెడ్డి ని వెంటనే సస్పెండ్ చేయాలని శనివారం సిపిఎం ఆందోల్ డివిజన్ కార్యదర్శి విద్యాసాగర్ అన్నారు. ఈ సందర్భంగా జోగిపేటలో ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పుల్కల్ మండలానికి చెందిన లక్ష్మి సాగర్ సర్పంచ్ మా గ్రామంలో బెల్ట్ షాపులను నివారించండి అని ఫోన్ చేస్తే బెల్ట్ షాపుల ద్వారే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. మీరు అలాంటిది మానుకోండి అని ప్రజల ప్రాణాలు మాకు అవసరం లేదు అని ఇష్టానుసారంగా మాట్లాడడం చాలా దుర్మార్గమని బెల్ట్ షాపులను అరికట్టే బాధ్యత ఎక్సైజ్ అధికారులకు ఉందని కానీ బాధ్యతను మర్చి వ్యవహరిస్తున్నారని ప్రజల సొమ్మును జీతం రూపంలో తింటూ ప్రజలకు రక్షణ కల్పించలేని జోగిపేట ఎక్సైజ్ సీఐ ని వెంటనే సస్పెండ్ చేయాలని లేని యెడల ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏరియా సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.


