రాజీ మార్గమే రాజ మార్గం… ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ – ప్రజలకు తక్షణ న్యాయం
మహబూబ్నగర్ జిల్లా/నమస్తే ఇందూర్/మార్చి 24. కే యాదయ్య చీఫ్ బ్యూరో
కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి
మహబూబ్నగర్ జిల్లా ప్రజల న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా, కోర్టుల పరిధిలో ఉన్న వివిధ కేసులను లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. తక్కువ ఖర్చుతో, త్వరితగతిన న్యాయం పొందేందుకు ఇది ఉత్తమ మార్గమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…
ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులు పాల్గొని తమ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. చిన్న చిన్న కేసులు, ట్రాఫిక్ చలానాలు, మైనర్ క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలు వంటి అంశాలను లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను తక్కువ సమయంలో ముగించుకునే మంచి అవకాశం ఇదని, శాంతియుతంగా ఇరు పక్షాల అంగీకారంతో సమస్యలు పరిష్కారం అయ్యే విధానం లోక్ అదాలత్ అని తెలిపారు.
కోర్టుల్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించుకునేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి ఐపీఎస్ తెలిపారు.

