వ్యక్తికి 7 స. ల కఠిన కారాగార శిక్ష :
నమస్తే ఇందురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 30
కొత్తగూడెం లీగల్ :: కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కె.కిరణ్ కుమార్ వ్యక్తికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ కు చెందిన పిప్పళ్ళ సుమంత ఫిర్యాదు ప్రకారం తన అక్క రాజేశ్వర్ కి డోర్నకల్ లో మండలం (chikkkodu) చిక్కుడు గ్రామానికి చెందిన కొలిపాక అశోక్ తో సుమారు 20 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని ,వివాహం అయిన కొద్ది రోజులకు తన అక్క బావ పాల్వంచ మండలం మంచి కంటినగర్ లో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారని వారిద్దరికీ సంతానం కలరు. గత కొద్దిరోజులుగా ఆమె అక్క ఎదురింటిలో ఉండే మాచర్ల ఏసుబాబు తో ఫోన్లో అధికంగా మాట్లాడుచున్నద ని తన భర్త పెద్ద మనుషులతో కూర్చోబెట్టి సర్దిచెప్పిoచి నారు. అయినప్పటికి ని తన భర్త అశోక్ , మాచర్ల యేసుబాబు తో తన భార్య తో మాట్లాడడo మానేయమని చెప్పిన వినలేదని ,తన భార్యను తీసుకొని పోతానని మాచర్ల ఏసుబాబు అశోక్ తో చెప్పాడని ఆ అనుమానము తో 2019 నవంబర్ 5 న తన భార్యను రాడ్డుతో తలపై కొట్టగా రక్తం మడుగులో పడి ఉందని , సుమలత ఫోను చేసినప్పటికీ ఎవరు ఫోన్ ఎత్తనందునందు న, తన అక్కకు తన బావకు ఏం జరిగిందని ఫోన్ చేసినప్పటికి ని ఫోన్ ఎత్తనందున అశోక్ యొక్క తమ్ముడ గు శ్రీనాథ్ కు తెలుపగా అతను భూక్య కోటేశ్వరరావు అనే అతని పంపించి చూడగా తన అక్క రాజేశ్వరి రక్తపు మడుగులో ఉందని, తన బావ అశోక్ ఉరి పెట్టుకొని ఉన్నాడని, సుమలత వచ్చి చూసి తన అక్కను పాల్వంచ ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకొని వెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తుండగా చని పోయినదని మాచర్ల ఏసుబాబు పై పాల్వంచ టౌన్ పోలీస్ వారికి రిపోర్ట్ ఇవ్వగా అప్పటి ఎస్సై జె. ప్రవీణ్ కేసు నమోదు చేయగా, అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎం.అబ్బయ్య, పి. నవీన్ లు దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జి షీట్ దాఖలు చేశారు.కోర్టులో 16 మంది సాక్షులను విచారించారు. మాచర్ల ఏసుబాబు పై నేరము రుజువు కాగా, ఏడు సంవత్సరాల కఠిన కారగార శిక్ష, రూ .10,000/- జరిమానా చెల్లించాలి లేదా మూడు నెలల సాధారణ శిక్ష విధిస్తూ కోర్టు లో తీర్పు చెప్పారు. జనమానాలోని రూ.9000/- ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అప్పిలు టైం తర్వాత చనిపోయిన అశోక్ కుమారుడగు కొలిపాక భీమ్ ప్రకాష్ కు అప్పీల్ టైం తదుపరి చెందాలని, మిగతా రూ.1000/- గవర్నమెంట్ కు జమ చేయాలని తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ ను అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కారం రాజారావు నిర్వహించగా, కోర్టు నోడల్ ఆఫీసర్ ఎస్సై జి. రాఘవయ్య, కోర్టు లైజాన్ ఆఫీసర్ ఎం శ్రీనివాస్,( కోర్టు డ్యూటీ ఆఫీసర్ )పి.సి. జరుపుల రవి లు సహకరించారు
