సంగారెడ్డిజిల్లాలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలుకు ఆరోగ్య సేవల్లో కీలక ముందడుగు
*సంగారెడ్డిజిల్లాలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలుకు ఆరోగ్య సేవల్లో కీలక ముందడుగు*
సంగారెడ్డి జిల్లా/నమస్తే ఇం
దూర్/: , మార్చి 23. కే యాదయ్య చీఫ్ బ్యూరో:
సంగారెడ్డి జిల్లాను డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలుకు పైలెట్ జిల్లాగా ఎంపిక చేసిన నేపథ్యంలో ఆరోగ్య రంగంలో మరో కీలక ముందడుగు పడింది. సోమవారం నుండి సంగారెడ్డి డివిజన్ పరిధిలోని 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs), రెండు ఏరియా ఆసుపత్రులు, మూడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (UPHCs), ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH), ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రోగుల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో ప్రయోగాత్మకంగా నమోదు చేయడం ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఇందిరానగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ నమోదు ప్రక్రియ, డేటా ఎంట్రీ, రోగుల వివరాల సేకరణ విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు. రోగుల ఆరోగ్య చరిత్రను డిజిటల్ రూపంలో భద్రపరచడం ద్వారా వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించ వచ్చని ఆమె తెలిపారు.
నెట్వర్క్, టెక్నికల్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రోజు ప్రగతిని సమీక్షిస్తూ, సమర్థవంతంగా అమలు చేపట్టాలని సూచించారు.
డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలు ద్వారా రోగుల ఆరోగ్య చరిత్ర, పరీక్షల వివరాలు, చికిత్స సమాచారం అన్నీ ఒకే వేదికపై అందుబాటులో ఉండి, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు ఇది ఎంతో దోహద
పడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వసంత్ రావు,డాక్టర్ శశాంక్, మెడికల్ ఆఫీసర్లు మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా/నమస్తే ఇందూర్/: , మార్చి 23. కే యాదయ్య చీఫ్ బ్యూరో: