*సంగారెడ్డి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం.సంగారెడ్డి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం.* సంగారెడ్డి జిల్లా/సదాశివపేట్/నమస్తే ఇందూర్ (మార్చి 23. కే యాదయ్య చీఫ్ బ్యూరో
• ఎస్-న్యాబ్, సిసిఎస్, సదాశివపేట పోలీసుల సంయుక్త ఆపరేషన్లో సుమారు 2.87-కోట్ల విలువ గల 574 కిలోల నిషేదిత ఎండు గంజాయి స్వాధీనం.
• 3- అంతర్రాష్ట్ర అక్రమ రవాణాదారులు అరెస్ట్. 1-కియా సోనేట్ కారు MH31EC0998, డిసియం MH45AP4313, 287-గంజాయి ప్యాకెట్లు సీజ్.
• కేసు చేదనలో కీలకంగా వ్యవహరించిన అధికారులను అభినందించిన ల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సంగారెడ్డి తేది: 23.03.2026 నాడు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు పటాన్ చెర్వు డిఎస్పీ ప్రభాకర్, సంగారెడ్డి జిల్లా ఎస్-న్యాబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావ్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, సదాశివపేట ఇన్స్పెక్టర్ డి.వెంకటేశ్ సిబ్బందితో కలిసి నమ్మదగిన సమాచారం మేరకు సదాశివపేట బైపాస్ రోడ్డు లో సంగారెడ్డి వైపు నుండి వస్తున్న కియా సోనేట్ కారు MH31EC0998, డిసియం MH45AP4313, గల వాటిని తనిఖీ నిర్వహించగా డిసియంలో 287-ప్యాకెట్ల ఎండు గంజాయిని గుర్తించారు. దాని విలువ సుమారు 2.87 కోట్ల రూపాయలు ఉంటుంది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని, క్రైమ్ నెంబర్ 151/2026 సదాశివపేట పోలీసు స్టేషన్ నందు కేసు నమోదు చేసి, నిందితులను న్యాయస్థానం ముందు ప్రవేశ పెట్టడం జరుగుతుంది అన్నారు.
నిందితుల వివరాలు: అరెస్టు చేసిన నిందితులు: 1-పింకు, 2-పప్పు దలాయి, 3-నారాయణ ప్రసాద్ బెహ్రా
జిల్లాలో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై జిల్లా పోలీసులు ఉక్కు పాదం మోపడం జరుగుతుందని, ఎవరైనా గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలను సాగు, సరఫరా చేసిన సంగారెడ్డి జిల్లా S-Nab నెంబర్ 8712656777 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఇట్టి కేసు చేదనలో కీలకంగా వ్యవహరించిన సంగారెడ్డి జిల్లా ఎస్-న్యాబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావ్, సిబ్బంది, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, సదాశివపేట ఇన్స్పెక్టర్ వెంకటేశం, క్లూస్ టీం సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
Thursday, April 2
Trending
- తుల్జాభావాని ఆరవ వార్షికోత్సవం కు ఆహ్వానం(మత పార్వతమ్మ)
- నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
- రాజీ మార్గమే రాజ మార్గం
- యువకులు క్రీడలపట్ల ఆసక్తిని కనబర్చాలి: కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్
- పుల్కల్ గ్రామంలో జోరుగా సాగుతున్న అభివృద్ధి పనులు
- టీబీ రహిత జిల్లాయే లక్ష్యం
- అక్రమ ఇసుక తరలింపు లారీ పట్టివేత..
- సుల్తాన్పూర్ జేఎన్టీయూలో విద్యార్థుల డాన్స్
