సావిత్రిబాయి పూలే ఆశయాలు చిరస్మరణీయం.
సంగారెడ్డి జిల్లా/ నమస్తే ఇందుర్/ జనవరి 3/ అందరూ నియోజవర్గం రిపోర్టర్ నాగరాజు
ఈరోజు సంగారెడ్డిలో సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది, ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆశన్న గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ, భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని ఆమె మహిళల చదువుకు అభ్యున్నతి కోసం కృషిచేసిన మహనీయురాలని వారు అన్నారు. సామాజిక న్యాయం కోసం అంటరాని తల నిర్మూలన కోసం, స్త్రీల హక్కుల కోసం తన జీవితాంతం త్యాగం చేసి పోరాడిన వీరనారి సావిత్రిబాయి పూలే అని వారు గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో స్త్రీల గౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం వారి చూపిన బాటలో పయనించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్న గౌడ్ గౌడ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్. సంగారెడ్డి మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ జిల్లా నాయకులు మల్లేశం గౌడ్. ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు చెన్నాగౌడ్. సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు*


