సుల్తాన్పూర్ జేఎన్టీయూలో విద్యార్థుల డాన్స్
సంగారెడ్డి జిల్లా/చౌటకుర్ మండలం/నమస్తే ఇందూర్/మార్చి 23. నర్సింలు రిపోర్టర్
సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న 14వ టెక్నో ఫెస్ట్ ఉత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్య క్రమాల్లో విద్యార్థినీ, విద్యార్థులు పోటీపడి చేసిన డ్యాన్స్‌లు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాశాల ప్రిన్సిపాల్ విశ్వనాథరాజు, వైస్ ప్రిన్సిపల్ రాఘవేంద్రరావు మరియు అధ్యాపక బృందం ఈ వేడుకలను తిలకించి విద్యార్థులను ఉత్సాహపరిచారు.
