స్వీట్ హోమ్ ను ప్రారంభించిన ఓబిసి
ఇందూరు వార్త/ అక్టోబర్ 15/కోటగిరి,పొతంగల్:
పోతంగల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో జోద్పూర్ మిఠాయి వాళ్ళ స్వీట్ హోమును ముఖ్య అతిథిగా హాజరై ఓబిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గారిగ్గే శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి కార్యానికి మనం స్వీట్లు వాడుతూ ఇందులో దొరికే ,కాజు కత్లి, అంజీర్ బార్బీ, రస్ మలై బాసుంది, చంచం, పలు రకాల స్వీట్ లు సరసమైన ధరలకు లభిస్తున్నట్లు మండల ప్రజలు చుట్టుపక్క గ్రామాల వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాయక్వాడ్ హన్మంతు, వైస్ చైర్మన్ పులికంటి సాయిలు, మేవా రామ్ సామాజిక సేవ కార్యకర్త ఎంఏ అకీమ్, పబ్బ శేఖర్,మక్కయ్య, కాషా గౌడ్ , ఓమన్న పటేల్,వహీద్ ,బండారి గంగారాం, గంధపు హనుమాన్లు, గంధపు మోహన్, పాగల్ నవీన్ , నాగెల్లి శ్రీనివాస్, సూదం నాగభూషణం ,బొంబాయి శంకర్, తదితరులు పాల్గొన్నారు.
