కల్తీ కళ్లు దుకాణాలపై చర్యకు తీసుకోండి…
-అధికారులకు ముప్పిరెడ్డిపల్లి గ్రామస్థులు వినతి…
మనోహరాబాద్, సెప్టెంబర్ 19 ( నమస్తే ఇందూర్) కల్తీకల్లు అక్రమంగా పరిమితిని మించి మత్తు పదార్ధాలతో కల్తీకల్లు తో పాటు మద్యం విక్రయిస్తున్న దుకాణాలపై చర్యకు తీసుకోవాలని మనోహరబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామస్థులు వినతిపత్రం గురువారం నాడు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్,అదనపు కలెక్టర్ నాగేష్, ఎక్సైజ్ సూపర్డెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ సీఐ ముస్తఫా, సీఐ రంగకృష్ణ ఎస్ఐ సుభాష్ గౌడ్
లకు పిర్యాదు అందజేశారు.గ్రామంలో పోటాపోటీగా మత్తు ఎక్కువ కలుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కళ్ళు దుకాణాలపై కటినంగా చర్యలు తీసుకోవాలని కోరారు.గ్రామస్థులు అందరూ కలిసికట్టుగా గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడిన వినకుండా మాకు అధికారులు తెలుసు అంటూ ప్రజల భయాందోళనకు గురి చేస్తున్న దుకాణ దారులపై చర్యకు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అదే కాకుండా పర్మిషన్ తీసుకున్న చోట కాకుండా వారి ఇష్టానుసారంగా రోడ్డుపై దుకాణాలు పెడుతూ రోడ్డుకు అడ్డుగా వాహనాలు పెడుతూ రాకపోకలకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


