క్రీడాకారులకు సన్మానం చేసిన మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్
నమస్తే ఇందూరు కామారెడ్డి బీబీపేట్ మార్చి 1 
బీబీపేట్ మండలం తుజాల్పూర్ గ్రామానికి చెందిన క్రీడాకారులు ఇటీవల జరిగిన సీఎం కప్ రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి వాలీబాల్ టీం లో బహుమతులు పొందిన విష్ణు తేజ , సంజయ్, నవదీప్, తేజ ,నీరజ్ లను కామారెడ్డి జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్ తన నివాసంలో ఆదివారం సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు రాష్ట్రస్థాయి జిల్లాస్థాయిలో ఆడటం ఎంతో గర్వకారణంగా ఉందని అలాగే క్రీడాకారులకు ఎప్పుడు తనవంతు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వాలీబాల్ టీం పూదరి రాజు టీం కోచ్ సభ్యులు పాల్గొన్నారు.

