తెలంగాణ రాష్ట్ర బంద్ విజయవంతం చేయాలి బీసీల ఐక్యతను చాటుదాం
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు పెద్ద పోతన్న రాము పటేల్
నమస్తే ఇందూర్, డెస్క్ అక్టోబర్ 17
తెలంగాణ రాష్ట్రంలో 42% శాతం బిసి రిజర్వేషర్లను లను రక్షించుకోవడమే ద్వేయంగా బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 18వ తేదీన తెలంగాణ బంద్ కు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నానని బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు పెద్ద పోతన్న గారి రాము అన్నారు. ప్రతి ఒక బీసీలకు సంఘాలు వివిధ రాష్ట్ర రాజకీయ పార్టీలు బందు కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ఇచ్చి బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% శాతం రిజర్వేషన్ల కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 పైన హైకోర్టు స్టే విధించడం ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి తిరిగి వెనక్కి తీసుకోవడం బీసీలకు అత్యంత బాధాకరమైన విషయమని తెలిపారు. కోర్టులో నిలబడని జీవో తీసుకువచ్చి బీసీలను మోసం చేయాలని చూస్తున్నారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పెద్ద పోతన్న గారి రాము అన్నారు.


