యువకులు క్రీడలపట్ల ఆసక్తిని కనబర్చాలి: కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్
సంగారెడ్డి జిల్లా /నమస్తే ఇందూర్ /మార్చ్ 24/అందోల్ నియోజకవర్గం
మెదక్ జిల్లా టేక్మాల్ మండల్ ఆందోల్ నియోజకవర్గం తంప్లూర్ గ్రామంలో ఉగాది ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత జాతర సందర్భంగా కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి యువ నాయకులు సర్వాణి లక్ష్మణ్ హాజరై క్రీడలను ప్రారంభించారు. లక్ష్మణ్ గారు మాట్లాడుతూ యువకులు క్రీడల్లో రాణించాలని ప్రతిభావంతులైన క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం నిర్వహించిన గ్రామ స్థాయి కబడ్డీ టోర్నమెంట్ లో ఫైనల్ లో చరణ్ యాదవ్ వర్సెస్ ఆకుల హర్షవర్ధన్ ఇరు జట్ల మధ్య హోరాహోరి జరిగిన పోరులో చరణ్ యాదవ్ జట్టు విజేతగా నిలిచింది. విజేతగా నిలిచిన జట్టుకు సర్వాణి లక్ష్మణ్ గారు ట్రోఫీ మరియు నగదు బహుమతి 5000/- రూపాయలు అందజేయడం జరిగింది.
రన్నర్, అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు మరియు ఆకుల హర్షవర్ధన్ జట్టుకు గాజరబోయిన శ్రీనివాస్,గాజరబోయిన నారాయణ యాదవ్ గార్లు ట్రోఫీని మరియు నగదు 3000/- రూపాయలు అందజేయడం జరిగింది. టోర్నమెంట్ సహకరించిన గ్రామ పెద్దలందరికీ క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు.

