లింబూర్ గ్రామ సర్పంచ్ గా సక్కవార్ సుజాత, శివారెడ్డి బాధ్యతల స్వీకిరణ
నమస్తే ఇందుర్ (న్యూస్) మద్నూర్ ప్రతినిధి జి.శ్రీకాంత్ Dec 22
కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలంలోని లింబూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా సక్కవార్ సుజాత, శివారెడ్డి సోమవారం అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు, ఈ ప్రమాణ స్వీకార వేడుకకు గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చారు, ఈ సందర్భంగా సక్కవార్ సుజాత శివారెడ్డి, మాట్లాడుతూ……………… గ్రామస్తుల సహకారంతో లింబూర్ గ్రామంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని. ప్రభుత సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఇంటికి చేరేలా నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సక్కవార్ సుజాత శివారెడ్డి,ఉప సర్పంచ్ పాండేరె మీనా, పండరి,గ్రామ ప్రజలు,వార్డ్ నెంబర్లు, మనేవార్ సంతోష్, గౌలే అంజన్ బాయి, హనుమంత్, తలారే శంకర్, గౌలే శివాజీ, తదితరులు పాల్గొన్నారు,

