సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా సింగూర్ గురుకులంలో ప్రిన్సిపల్ ఆగమయ్య TSUTF సూపరిండెంట్ చేతులు మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ.
సింగూరు గురుకులంలో ప్రిన్సిపాల్ ఆగమయ్య, సూపరిండెంట్ గంగాధర్ చేతుల మీదుగా TSUTF క్యాలెండర్ ఆవిష్కరణ
సంగారెడ్డి జిల్లా/ నమస్తే ఇందుర్/ జనవరి 3/ అందోల్ నియోజవర్గం రిపోర్టర్ నాగరాజు
పుల్కల్: సావిత్రి బా య్ పూలే జయంతి సందర్భంగా సింగూర్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ను సింగూర్ ప్రిన్సిపాల్ ఆగమయ్య, సూపరిండెంట్ గంగాధర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న TSUTF ను కొనియాడారు. ఈకార్యక్రమంలో TSUTF పుల్కల్ మండల ప్రధాన కార్యదర్శి తేరటి నరసింహ , కార్యదర్శి బొమ్మ శ్రీనివాస్, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


