సోయా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
జుక్కల్ ప్రతినిధి నాగభూషణం, నమస్తే ఇందూర్,03, సెప్టెంబర్
పిట్లం,జుక్కల్,బిచ్కుంద మరియు డోంగ్లీ మండల కేంద్రాల్లో సోయా కొనుగోలు కేంద్రాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు.సోయా ధాన్యానికి క్వింటాలుకు రూ.5,328/- ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని చెప్పారు..ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దు అని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు గారు విజ్ఞప్తి చేశారు..

