సబ్ రిజిస్టార్ ఆదాయానికి సర్వర్ సమస్య గండి కొట్టిందా …..?
• ఎంత పనిచేసిందే…. నెట్వర్క్..?
నమస్తే ఇందూర్,కామారెడ్డి సెప్టెంబర్ 03,
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నెట్వర్క్ సమస్యతో బుధవారం ఒక్క డాక్యుమెంట్ కూడా రిజిస్ట్రేషన్ కాకపోవడంతో లావాదేవీలు ఒక్కసారిగా ఆగిపోవడముతో వినియోగదారులు తిరుగుమొహం పట్టారు.
కొంపముంచిన ….వాన…
సామాన్యులకే కాదు వర్షం …సబ్ రిజిస్టార్ కార్యాలయానికి కూడా నష్టాన్ని కలిగించినదని ప్రజలు అంటున్నారు.వర్షాల కారణంగా నెట్వర్క్ కేబుల్స్ పాడైపోవడముతో సమస్య తలెత్తిందని డాక్యుమెంట్ రైటర్ లు గుసగుసలాడుతూ సబ్ రిజిస్టార్ కార్యాలయం ముందు నెట్ వర్క్ ఎపుడస్తుందో అని వేయి కళ్ల తో ఎదురుచుతు పడిగాపులు కాస్తున్నారు.
కొసమెరుపు….
ఒక్క డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కాకపోవడంతో వాన కొంపముంచిందనీ రిజిస్ట్రేషన్ చేసేవారి రోజు వారి ఆదాయానికి గండి పడిందని సదరు అధికారి బాధపడ్డట్లు విశ్వసనీయ సమాచారం…


