- సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

నమస్తే ఇందూర్ జుక్కల్ ప్రతినిధి అక్టోబర్ 29:
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో సోయా కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు.సోయా ధాన్యం క్వింటాలు రూ.5,328/- ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు. కావున రైతులందరూ సోయా ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని. దళారులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
