ఐటిసి పిఎస్పిడి చరిత్రలో కొత్త అధ్యయనం: మా అగ్రిమెంట్ మేమే చేసుకుంటాం అంటున్న కాంట్రాక్ట్ కార్మిక జేఏసి…
నమస్తే ఇందూర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 29
కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి
ఇలాంటి చైతన్యం కదా కావాల్సింది కార్మికుల్లో…
14వ వేతన ఒప్పందం కాంట్రాక్టు కార్మిక జేఏసీ తోనే జరపాలి
– 13వ వేతన ఎల్ టి ఏ పెండింగ్ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి
– జాయింట్ లేబర్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారులకు వినతి
సారపాక ఐ టి సి పి ఎస్ పి డి లో త్వరలో జరగబోయే 14వ వేతన ఒప్పందం కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ తోనే జరిపించాలని వరంగల్ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారి రాజేంద్రప్రసాద్, ఖమ్మం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారి విజయ్ భాస్కర్ రెడ్డి లకు బుధవారం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కాంట్రాక్టు కార్మికుల జేఏసీ అందించారు. 13వ వేతన ఒప్పందం ఎల్ టి ఏ పెండింగ్ కాపీని పెండింగ్ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. గత 13 వేతన ఒప్పందాలలో తమకు అవసరమైన వేతనాలు తమ సమస్యల పై పూర్తిస్థాయిలో పట్టించుకోలేదని తెలియజేశారు. తమకు రావలసిన న్యాయమైన తమ సంక్షేమం వేతనాలు ఆశించిన స్థాయిలో ఇవ్వలేదని వివరించారు. ప్రస్తుత గుర్తింపు సంఘానికి తమకు ఎటువంటి సంబంధం లేదని 13వ వేదన ఎల్ టి ఏ కాపీ గుర్తింపు సంఘాన్ని అడిగిన యాజమాన్యాన్ని అడిగిన తమకు ఇవ్వలేదని 13వ వేతన ఒప్పందం సమస్యలే పెండింగ్లో ఉన్నాయని వాటిని పరిష్కరించలేదని తాము జేఏసీగా ఏర్పడి తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసమే వినతి అందిస్తున్నామని పేర్కొన్నారు. సుమారు 2000 మంది కాంట్రాక్ట్ కార్మికుల అంతకాల సేకరణతో వినతిపత్రం అందించామని14వ వేతన ఒప్పందం తమ సమక్షంలో జరగాలని వినతి పత్రం ద్వారా కోరారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికుల సంఘం జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కోకన్వీనర్ సాని కొమ్ము రామచంద్రారెడ్డి, సభ్యులు వీరన్న ,సతీష్ ,వెంకట్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

