మాలపాడు గ్రామపంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం
సంగారెడ్డి జిల్లా/సదాశివపేట మండలం/మాలపాడు గ్రామం/నమస్తే ఇందూర్/డిసెంబర్ 22. కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్.
మాలపాడు గ్రామపంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఈ కార్యక్రమము మాలపాడు గ్రామపంచాయతీలో ఉదయం 10:30కు గ్రామపంచాయతీ సెక్రెటరీ కళావతి ఆధ్వర్యంలో నూతన సర్పంచిగా ప్రమాణస్వీకారం చేయించడం జరిగింది నూతన సర్పంచిగా. దేవుని సంతోష్ గౌడ్. ఉప సర్పంచ్ గా ఆర్ మొగులయ్య. ఒకటో వార్డ్ మెంబర్ ఎండి ఖలీమ్. రెండో వార్డ్ మెంబర్ ఆర్ మల్లమ్మ. మూడో వార్డ్ మెంబర్ ఆర్ మొగులయ్య. నాలుగో వార్డ్ మెంబర్ యం ప్రభూ. ఐదో వార్డ్ మెంబర్ టీ పుల్లమ్మ. ఆరో వార్డ్ మెంబర్ కే పున్నెమ్మ. ఏడో వాడు మెంబర్ డి రవి. ఎనిమిదవ వార్డ్ మెంబర్ యండి హసీనా బేగం. వీరందరూ తోని మాలపాడు పంచాయతీ సెక్రెటరీ కళావతి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. మాలపాడు గ్రామంలో గత ఐదు సంవత్సరాల క్రితం దేవుని సంతోష్ గౌడ్. ఎంపీటీసీగా గెలిచి ప్రజలకు ఎంతో సేవలు చేసినాడు. అందుకు ప్రజలు ఇప్పుడు సర్పంచ్ గా పట్టటం కట్టినారు. ప్రస్తుతం మాలపాడు సర్పంచ్ దేవుని సంతోష్ గౌడ్ పేద ప్రజలకు ఎలాంటి అవసరాలు వచ్చిన సహాయం చేయడమే ఆయనకు తెలిసిన విద్య. ఇంతకుముందు మాలాపాడ్. ఏటిగడ్డ సంగెం. బొబ్బిలిగామ. మూడు గ్రామాల్లో కలిసి ఎంపిటిసి గా పని చేసినాడు. అక్కడి ప్రజలు మాలపాడు సర్పంచ్ దేవుని సంతోష్ గౌడ్ ను. దేవునితో సమానంగా కొలుస్తారు. ఆయన ప్రమాణస్వీకారం చేసేటప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా. యువజన నాయకులు గ్రామ పెద్దలు వృద్ధులు యువకులు భారీ సంఖ్యలో వచ్చి బాణ సంచులు కాల్చి మాలపాడు గ్రామంలో భారీ పెద్దగా. ఆడవాళ్లు కూడా. వచ్చి బానసంచలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇంకా 20 సంవత్సరాల వరకు దేవుని సంతోష్ గౌడ్ మా ఊరికి సర్పంచ్ గా ఉండి మంచి సేవలు చేయాలని మాలపాడు గ్రామస్తులు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి ప్రెస్ వాళ్లకు చెప్పారు. ఎందుకు అని అనగా ఏ రాత్రి అయినా ఎవరికి ఏమి జరిగినా ఒక్క ఫోన్ కాల్ చేస్తే. రాత్రి రెండు గంటల కైనా వెళ్లి మా అవసరాలు తీరుస్తాడని అక్కడి జనాలు చెప్తుంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి సర్పంచి మాకు కావాలని గ్రామ ప్రజలు యువజన సంఘం నాయకులు గ్రామ పెద్దలు మహిళలు భారీ పెద్దగా వచ్చి ఆయనకు అభినందనలు తెలిపారు.


