నూతన పాలకవర్గానికి పలు సూచనలు చేసిన మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్
నమస్తే ఇందూర్ కామారెడ్డి జిల్లా బీబీపేట్ డిసెంబర్ 22
తుజాల్ పూర్ లో నూతన పాలకవర్గం గ్రామ సర్పంచ్ గా తలారి ప్రవిత ఉప సర్పంచ్ గా రంగయ్య గారి లక్ష్మారెడ్డి మరియు వార్డు సభ్యులు మమత ,రేణుక , నరేష్ , ప్రశాంత్ , సులోచన , సూర్యం, కుమార్ , అంజా గౌడ్ ,భూలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పలు రాజకీయ పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పరిగి ప్రేమ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరిస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, గ్రామాభివృద్ధిలో ఎల్లప్పుడూ తాను కూడా అందుబాటులో ఉంటానని తెలిపారు.

