పంట కొనుగోళ్లు, రైతుల సమస్యలపై అసెంబ్లీలో ప్రసంగించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
జుక్కల్ ప్రతినిధి నమస్తే ఇందూర్, న్యూస్ దినపత్రిక, 03, జనవరి
రాష్ట్రంలోనే అత్యధికంగా సోయా పంట పండించే జుక్కల్ నియోజకవర్గంలోని రైతుల సమస్యలు, పంట కొనుగోలు సమయంలో తలెత్తుతున్న ఇబ్బందులు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేఖ విధానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.. దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసే విధంగా కొనుగోళ్లకు సంబందించి ఒక కొత్త పాలసీని తీసుకురావాలని కోరారు.. బిచ్కుంద ప్రాంతంలో సోయా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందని, బిచ్కుందలో సోయా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేవిధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు..


