సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం
నమస్తే ఇందూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఫిబ్రవరి 9
అమెరికాతో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రద్దు చేయాలని, విత్తన, విద్యుత్, మార్కెట్ చట్టాలను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మదగ్ధం
నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం సామ్రాజవాద అమెరికాకు లొంగిపోయి ఏకపక్షంగా అమెరికాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం చేసుకుందని ఈ ఒప్పందం అమలు అయితే అమెరికా నుండి మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ తదితర పంటలు, పాల పదార్థాలు ఎలాంటి దిగుమతి సుంకాలు లేకుండా పెద్ద ఎత్తున మన దేశంలోకి దిగుమతి అవుతాయని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కార్యదర్శి వర్గ సభ్యులు అమర్లపూడి రాము అన్నారు
రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో దమ్మపేటలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అమర్లపూడి రాము మాట్లాడుతూ
అమెరికాలో వ్యవసాయ రంగానికి అక్కడి ప్రభుత్వం 50శాతం సబ్సిడీ ఇస్తుందని మన దేశంలో మన ప్రభుత్వం వ్యవసాయ రంగానికి భారత ప్రభుత్వం 3 శాతం మాత్రమే సబ్సిడీ ఇస్తుందని, మన దేశ వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులతో పోల్చితే అమెరికా వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు చాలా తక్కువఅని చౌకగా ఉత్పత్తి అయిన అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు ఈ ఒప్పందంతో మన దేశంలోకి విచ్చలవిడిగా వస్తాయని దీనివలన మన రైతాంగం పండించిన పంటలు అమ్ముకునే దారి లేక దివాళా తీస్తారని అలాగే మనదేశంలో 65 శాతం జనాభా ఆధారపడి ఉన్న మన వ్యవసాయ రంగం దెబ్బతింటుందని 9 కోట్ల మంది పాడి రైతులు దివాళా తీస్తారని అన్నారు
మన దేశంలోకి వచ్చే వస్తువులపై ఎలాంటి పన్నులు ఉండవు. మన దేశం నుండి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపైన 18శాతం పన్నులు అమెరికా విధించిందని మన ఎగుమతులు క్షీణిస్తాయని పత్తి దిగుమతిపై ఉన్న 11శాతం సుంకాన్ని రద్దు చేయడం వల్ల మన దేశంలోకి గత సంవత్సరం కంటే అదనంగా 177 మిలియన్ డాలర్ల పత్తి దిగుమతి అయిందని దీని ఫలితంగా మన రైతులు మద్దతు ధరకంటే తక్కువకు ధరకు పత్తిని అమ్ముకున్నారని అన్నారు
13 నెలల పాటు నిరవధికంగా సాగిన రైతు ఉద్యమం సందర్భంగా రైతు సంఘాలకు ఇచ్చిన హామీలు అమలు పరచకుండా మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని మరొకసారి మోసగించిందని రైతులు పండించే పంటలకు మద్దతు ధరల అమలు గురించి మాట్లాడటం మానేసిందని ఎరువుల మీద సబ్సిడీలు తగ్గించి ఎరువుల ధరలు విపరీతంగా పెంచుతున్నదని అన్నారు 2026-27 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఎరువులపై సబ్సిడీ తగ్గించిందని దాంతో ఎరువులు, పురుగుమందుల ధరలు పెరుగుతాయని గత సంవత్సరం యూరియా కొరత రైతులను ఎలా వేధించిందో మనం చూశామని అన్నారు
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కార్యదర్శి కురసం ముత్యాలరావు, ఏ ఐ యు కె ఎస్ మండల కార్యదర్శి పండూరి వీరబాబు, తామా రాముడు, కుంజా కాంతారావు, సున్నం జగన్, పూజల సంజీవరావు, కేసరి పోతురాజు తదితరులు పాల్గొన్నారు
