యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు చేయాలి
-జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
ఉమ్మడి మెదక్ జిల్లా/నమస్తే ఇందూర్/మార్చి 23. కే యాదయ్య చీఫ్ బ్యూరో
జిల్లాలో రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ, పౌర సరఫరా, అటవీ, శ్రీ శిశ సంక్షేమ శాఖలు అధికారులందరితో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో రబీ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సన్నాహాలు చేయాలని అధికారులు ఆదేశించారు.
ఏప్రిల్ 15 నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని సూచించారు.యాసంగి (రబీ) లో 4,45,466 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని స్వీకరించడానికి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.మెదక్ జిల్లాలో వన మహోత్సవంలో కార్యక్రమంలో లక్ష్యంగా మొక్కలు నాటి వాటి సంరక్షించాల్సిన బాధ్యత అధికారుల ది అన్నారు.
ఈ సంవత్సరం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాకు
31.7 లక్షల మొక్కలు నాటాలని నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా
పటిష్ట కార్యచరణ తో సిద్ధంగా ఉండాలన్నారు. జూలై మొదటి వారంలో ప్రారంభించే ఈ కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నర్సరీలలో ఎక్కడెక్కడ మొక్కలు లభ్యమవుతాయి ఏ ఏ మొక్కలు నాటాల్సి ఉంటుంది అలాగే 2027 టార్గెట్, 2028 లక్ష్యాలను నిర్దేశించుకుని
వాటిక అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు.
బాల్యవివాహాలు నిషేధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
తక్కువ బరువు, ఎత్తు కలిగిన చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు.
తక్కువ బరువు, ఎత్తు ఉన్న పిల్లల్ని గుర్తించి పరిత వెతిన సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి , ఇతర దరఖాస్తులను పరిశీలించి శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, అధికారులు పాల్గొన్నారు.
