Author: నమస్తే ఇందూర్

తుల్జాభావాని ఆరవ వార్షికోత్సవం కు ఆహ్వానం(మత పార్వతమ్మ సంగారెడ్డి జిల్లా /నమస్తే ఇందూర్ /మర్చి 24/అందోల్ నియోజకవర్గం అందోల్ నియోజకవర్గం ఆందోల్ మండలం నేరడిగుంట గ్రామంలో తుల్జాభావాని మాత ఆరవ వార్షికోత్సవ వేడుకలకు అందరికి ఆహ్వానం పల్కుతున్నట్లు ఆలయ మాత పార్వతమ్మ తెలిపారు. బుధవారం రోజు ఉదయం గణపతి పూజ తో ప్రారంభం అయ్యి హోమ కార్యక్రమాలు ఉంటాయని మధ్యాహ్నం రెండు గంటలకు అమ్మవారికి బోనాలు సమర్పించి భక్తుల సౌజన్యంతో ఆలయం తరుపున అన్న ప్రసాద వితరణ ఉంటుందని కార్యక్రమం మొత్తం జ్యోతిరవస్తు విద్యా పీఠం పసల్వాది వారి నిర్వహణలో ఉంటుందని అందుకు అమ్మవారి పిలుపు అందుకుని సమస్త భక్తులు హాజరు కావాలని ఆలయ మాత వారాది పార్వతమ్మ కోరారు.

Read More

ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి. సంగారెడ్డి జిల్లా/నమస్తే ఇందూర్/మార్చి 24. కే యాదయ్య చీఫ్ బ్యూరో • రాజీ పడదగిన అన్ని కేసుల్లో కక్షిదారులు పరస్పర సమ్మతితో రాజీ కుదుర్చుకోవచ్చు. :జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, సంగారెడ్డి జిల్లా లోకల్ టైమ్స్ న్యూస్ ప్రతినిధి: ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, క్షణికావేశంలో జరిగిన తప్పులను సరిదిద్దుకునేందుకు లోక్ అదాలత్ ఒక మంచి అవకాశమని తెలిపారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండి, జీవితాలను ఇబ్బందులకు గురి చేయకూడదని సూచించారు. జిల్లా వ్యాప్తంగా నమోదై, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మరియు రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న కేసులలో కక్షిదారులు పరస్పర అవగాహనతో రాజీ పడేందుకు లోక్ అదాలత్ దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ నెల 28న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను…

Read More

రాజీ మార్గమే రాజ మార్గం… ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ – ప్రజలకు తక్షణ న్యాయం మహబూబ్నగర్ జిల్లా/నమస్తే ఇందూర్/మార్చి 24. కే యాదయ్య చీఫ్ బ్యూరో కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా, కోర్టుల పరిధిలో ఉన్న వివిధ కేసులను లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. తక్కువ ఖర్చుతో, త్వరితగతిన న్యాయం పొందేందుకు ఇది ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో కక్షిదారులు పాల్గొని తమ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. చిన్న చిన్న కేసులు, ట్రాఫిక్ చలానాలు,…

Read More

యువకులు క్రీడలపట్ల ఆసక్తిని కనబర్చాలి: కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్ సంగారెడ్డి జిల్లా /నమస్తే ఇందూర్ /మార్చ్ 24/అందోల్ నియోజకవర్గం మెదక్ జిల్లా టేక్మాల్ మండల్ ఆందోల్ నియోజకవర్గం తంప్లూర్ గ్రామంలో ఉగాది ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత జాతర సందర్భంగా కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి యువ నాయకులు సర్వాణి లక్ష్మణ్ హాజరై క్రీడలను ప్రారంభించారు. లక్ష్మణ్ గారు మాట్లాడుతూ యువకులు క్రీడల్లో రాణించాలని ప్రతిభావంతులైన క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం నిర్వహించిన గ్రామ స్థాయి కబడ్డీ టోర్నమెంట్ లో ఫైనల్ లో చరణ్ యాదవ్ వర్సెస్ ఆకుల హర్షవర్ధన్ ఇరు జట్ల మధ్య హోరాహోరి జరిగిన పోరులో చరణ్ యాదవ్ జట్టు విజేతగా నిలిచింది. విజేతగా నిలిచిన జట్టుకు సర్వాణి లక్ష్మణ్ గారు ట్రోఫీ మరియు నగదు బహుమతి 5000/- రూపాయలు అందజేయడం జరిగింది. రన్నర్, అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు మరియు ఆకుల హర్షవర్ధన్…

Read More

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాలతో పుల్కల్ గ్రామంలో జోరుగా సాగుతున్న అభివృద్ధి పనులు సంగారెడ్డి జిల్లా/పుల్కల్ మండలం/నమస్తే ఇందూర్/మార్చి 24. పుల్కల్ మండల కేంద్రమైన పుల్కల్ గ్రామంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సైన్ సైన్ టెక్నాలజీ శాఖ మంత్రివర్యులు ఆదేశాల మేరకు పుల్కల్ ఉన్నత పాఠశాల స్కూల్ ప్రహరీ గోడ. పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి పుల్కల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బోయిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్కూల్ ప్రహరీ గోడ. స్కూల్ గేట్. స్కూల్ మరమ్మత్తులు పూర్తిగా జోరుగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బోయిన శ్రీనివాస్ తెలిపాడు. మా పుల్కల్ గ్రామానికి చెందిన ప్రభుత్వ హాస్పిటల్ కి. 10 లక్షల రూపాయలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అక్షరాల 10 లక్షల రూపాయలు విడుదల చేసినాడు. అని బోయిన శ్రీనివాస్ తెలిపాడు. మరియు మన పుల్కల్ గ్రామానికి…

Read More

టీబీ రహిత జిల్లాయే లక్ష్యం . *జిల్లా కలెక్టర్ ప్రావీణ్య.**సంగారెడ్డి జిల్లా/నమస్తే ఇందూర్/మార్చి 24. కే యాదయ్య చీఫ్ బ్యూరో సంగారెడ్డిలో అవగాహన ర్యాలీతో 100 రోజుల ‘TB ముక్త్ భారత్ అభియాన్ v2.0’ ప్రారంభం సంగారెడ్డి, లోకల్ టైమ్స్ న్యూస్: మార్చి 24:- సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి టీబీ రహిత తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పిలుపు నిచ్చారు.ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి సబ్ సెంటర్ వద్ద మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రావీణ్య జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించడంతో పాటు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 100 రోజుల ‘TB ముక్త్ భారత్ అభియాన్ v2.0’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, టీబీ వ్యాధి పూర్తిగా నయం అయ్యే వ్యాధి అని, ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా దీన్ని…

Read More

అక్రమ ఇసుక తరలింపు లారీ పట్టివేత.. జహీరాబాద్ /న్యాల్కల్ /మర్చి 24(నమస్తే ఇందూర్ ప్రతినిధి ):- న్యాలకల్ మండలం పరిధిలోని హద్నూర్ మండలంలో అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతుండగా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ఒక లారీని పట్టుకున్నారు.తెల్లవారుజామున సుమారు 00:30 గంటల సమయంలో హద్నూర్ దోమ సుజిత్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు.జహీరాబాద్ నుండి బీదర్ వైపు అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న టీఎస్ 05 యుసి 7327 నంబరు గల లారీని గుర్తించి ఆపివేశారు. పరిశీలనలో అవసరమైన పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు తేలింది.దీనితో వెంటనే లారీని స్వాధీనం చేసుకుని హద్నూర్ పోలీసు స్టేషన్కు తరలించారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read More

సుల్తాన్పూర్ జేఎన్టీయూలో విద్యార్థుల డాన్స్ సంగారెడ్డి జిల్లా/చౌటకుర్ మండలం/నమస్తే ఇందూర్/మార్చి 23. నర్సింలు రిపోర్టర్ సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న 14వ టెక్నో ఫెస్ట్ ఉత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్య క్రమాల్లో విద్యార్థినీ, విద్యార్థులు పోటీపడి చేసిన డ్యాన్స్లు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాశాల ప్రిన్సిపాల్ విశ్వనాథరాజు, వైస్ ప్రిన్సిపల్ రాఘవేంద్రరావు మరియు అధ్యాపక బృందం ఈ వేడుకలను తిలకించి విద్యార్థులను ఉత్సాహపరిచారు.

Read More

సంగారెడ్డిజిల్లాలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలుకు ఆరోగ్య సేవల్లో కీలక ముందడుగు *సంగారెడ్డిజిల్లాలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలుకు ఆరోగ్య సేవల్లో కీలక ముందడుగు* సంగారెడ్డి జిల్లా/నమస్తే ఇందూర్/: , మార్చి 23. కే యాదయ్య చీఫ్ బ్యూరో: సంగారెడ్డి జిల్లాను డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలుకు పైలెట్ జిల్లాగా ఎంపిక చేసిన నేపథ్యంలో ఆరోగ్య రంగంలో మరో కీలక ముందడుగు పడింది. సోమవారం నుండి సంగారెడ్డి డివిజన్ పరిధిలోని 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs), రెండు ఏరియా ఆసుపత్రులు, మూడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (UPHCs), ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH), ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో రోగుల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో ప్రయోగాత్మకంగా నమోదు చేయడం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఇందిరానగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ నమోదు ప్రక్రియ, డేటా ఎంట్రీ,…

Read More

యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు చేయాలి -జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఉమ్మడి మెదక్ జిల్లా/నమస్తే ఇందూర్/మార్చి 23. కే యాదయ్య చీఫ్ బ్యూరో జిల్లాలో రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ, పౌర సరఫరా, అటవీ, శ్రీ శిశ సంక్షేమ శాఖలు అధికారులందరితో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో రబీ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సన్నాహాలు చేయాలని అధికారులు ఆదేశించారు. ఏప్రిల్ 15 నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని సూచించారు.యాసంగి (రబీ) లో 4,45,466 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని స్వీకరించడానికి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.మెదక్ జిల్లాలో వన మహోత్సవంలో కార్యక్రమంలో లక్ష్యంగా మొక్కలు నాటి వాటి సంరక్షించాల్సిన బాధ్యత అధికారుల ది అన్నారు.…

Read More