Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- తుల్జాభావాని ఆరవ వార్షికోత్సవం కు ఆహ్వానం(మత పార్వతమ్మ)
- నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
- రాజీ మార్గమే రాజ మార్గం
- యువకులు క్రీడలపట్ల ఆసక్తిని కనబర్చాలి: కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్
- పుల్కల్ గ్రామంలో జోరుగా సాగుతున్న అభివృద్ధి పనులు
- టీబీ రహిత జిల్లాయే లక్ష్యం
- అక్రమ ఇసుక తరలింపు లారీ పట్టివేత..
- సుల్తాన్పూర్ జేఎన్టీయూలో విద్యార్థుల డాన్స్
Author: నమస్తే ఇందూర్
నేడు మూడు గ్రామాల్లో సీఎం కప్ పోటీలు నమస్తే ఇందుర్ (న్యూస్) మద్నూర్ ప్రతినిధి,జి శ్రీకాంత్ jan 17 కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలంలోని మూడు గ్రామాల్లో శనివారం సీఎం కప్ _ 2026 పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జగదీష్ అనిల్ కుమార్ తెలిపారు, ఉదయం 10: 30 గంటలకు డోంగ్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో, మధ్యాహ్నం 12:00 గంటలకు లింబూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో, ఒంటి గంటకు ఒంటి గంటకు మొఘ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జగదీష్ అనిల్ కుమార్ వివరించారు, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు,
ఎమ్మెల్యే మేఘా రెడ్డి జన్మదినం సందర్భంగా నోట్ పుస్తకాల పంపిణీనమస్తే ఇందుర్ పెబ్బేర్ జనవరి 8వనపర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పుట్టినరోజు వేడుకలు గురువారం పెబ్బేరు మున్సిపాలిటీ పదో వార్డులోని చెంచువాడ మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.వనపర్తి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్,తనయుడు యువ నాయకులు అక్కి మణిదీప్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వనపర్తి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్,పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ సాగర్ మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్,రామన్ గౌడ్,భాను ప్రకాష్ రెడ్డి,రణధీర్ రెడ్డి,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేష్, వినయ్,అశోక్,మనీ గౌడ్ ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బిచ్కుందలో సర్పంచులు–ఉపసర్పంచుల ఆత్మీయ సమ్మేళనం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నేతృత్వం డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథిజుక్కల్ ప్రతినిధి పండు వారి నాగభూషణం నమస్తే ఇందూర్ న్యూస్ దినపత్రిక 4 జనవరికామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రంలో గల బండయప్ప ఫంక్షన్ హాల్ లో ఈరోజు జుక్కల్ నియోజకవర్గం లోని సర్పంచులు, ఉపసర్పంచుల కోసం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం అత్యంత ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమాన్ని జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు స్వయంగా నేతృత్వం వహించి నిర్వహించగా, నియోజకవర్గ అభివృద్ధి దిశగా ఆయన చూపిన చొరవ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సమ్మేళనానికి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథిగా హాజరై, కార్యక్రమానికి రాజకీయ ప్రాధాన్యతను పెంచారు.ఈ సందర్భంగా మాట్లాడిన డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గ్రామ పాలనకు వెన్నెముకలైన సర్పంచులు, ఉపసర్పంచుల సేవలు అమూల్యమైనవి. కాంగ్రెస్…
*సావిత్రిబాయి పూలే జయంతి.. సందర్భంగా ఆ తల్లికి ఘన నివాళులు అర్పిస్తున్న* .. *సర్పంచ్* *దిడ్డి మోహన్ రావు* *భారతదేశంలో తొలి మహిళా.. ఉపాధ్యాయురాలిగా, స్త్రీ విద్యకు పునాదులు వేసిన మహనీయురాలు..* *సావిత్రిబాయి పూలే గారి జయంతిని, కాటాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో ఘనంగా జరుపుకున్నాము* . *జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఈ సందర్భంగా గౌరవంగా స్మరించుకుంటున్నాం* . *విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నిరూపించిన సావిత్రిబాయి పూలే గారి సేవలు నేటికీ మహిళలకు, ఉపాధ్యాయులకు ప్రేరణగా నిలుస్తున్నాయి అని..* *సర్పంచ్ దిడ్డి మోహన్ రావు అన్నారు..* *ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ముండ్రాతి రాజమౌళి మాజీ సర్పంచులు పులి నరసయ్య మేడిశెట్టి నరసింహయ్య మాజీ ఎంపిటిసి దానక నర్సింగ రావు ఉపసర్పంచ్ పాలకుర్తి బాబు మాజీ పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ ఇందారపు లాలయ్య మాజీ కోఆప్షన్ మెంబెర్ దిలావర్ ఖాన్ గ్రామ కమిటీ తడక హరీష్…
విద్య దీప శిఖ, సావిత్రిబాయి పూలే * సావిత్రిబాయి జ్యోతిబాపూలే జయంతోత్సవ శుభాకాంక్షలు * రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ * ఉమనగారి కృష్ణ గౌడ్ కవి గేయ రచయిత సావిత్రీబాయి ఫూలే విద్యా విప్లవ శంఖారావం..అక్షరాల అంధకారంలోఆడబిడ్డల అడుగులు బంధించబడిన రోజుల్లోఒక దీపశిఖలా వెలిగిన పేరు సావిత్రీబాయి ఫూలే!కులం గోడల్ని కూల్చిన కలం ఆమెది,లింగ వివక్షను లెక్కచేయని అడుగు ఆమెది,పుస్తకాన్ని ఆయుధంగా మార్చిన తొలి పోరాట శక్తిఈ దేశానికి ఆమె అందించిన వరం!1848 జనవరి ఒకటి…పూణే గడ్డపైమొదటి మహిళా పాఠశాల తలుపులు తెరిచిన వేళవిద్యకు కొత్త ఉదయం మొదలైంది!బ్రాహ్మణ కట్టుబాట్లకు ప్రశ్నగా,మూఢనమ్మకాలకు మంటగా,ఆడపిల్లల చేతిలోచాక్ ముక్క పెట్టిన విప్లవం ఆమెది!వితంతువుల కన్నీళ్లకు కవచమై,అనాధ శిశువులకు అమ్మ ఒడిగా మారి,“మహిళా సేవా మండలి” ద్వారామానవత్వాన్ని ఉద్యమంగా మార్చింది!దళితుల కోసం తెరిచిన పాఠశాల కేవలం భవనం కాదు,అది సమానత్వానికి పునాది!ఉచిత విద్య… మధ్యాహ్న భోజనం…ఆకలితో కాదు, ఆశతో చదవమన్న సందేశం!కరువు కాలంలోరెండువేల అనాథలకుఆమె గుండెనే ఆశ్రమం…ఆమె ప్రేమే పాఠ్యపుస్తకం!జ్యోతిరావు…
సావిత్రిబాయి పూలే ఆశయాలు చిరస్మరణీయం. సంగారెడ్డి జిల్లా/ నమస్తే ఇందుర్/ జనవరి 3/ అందరూ నియోజవర్గం రిపోర్టర్ నాగరాజుఈరోజు సంగారెడ్డిలో సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది, ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆశన్న గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ, భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని ఆమె మహిళల చదువుకు అభ్యున్నతి కోసం కృషిచేసిన మహనీయురాలని వారు అన్నారు. సామాజిక న్యాయం కోసం అంటరాని తల నిర్మూలన కోసం, స్త్రీల హక్కుల కోసం తన జీవితాంతం త్యాగం చేసి పోరాడిన వీరనారి సావిత్రిబాయి పూలే అని వారు గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో స్త్రీల గౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం…
గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల బలోపేతానికి ఆసుపత్రులను అనుసంధానం చేస్తున్నాం పేదవారి ఆరోగ్య భద్రత ప్రభుత్వ బాధ్యత. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలను అందించటం వరం RMP , PMP ల అంశం న్యాయస్థానం పరిధి లో ఉన్నది RMP , PMP ల సమస్యల పరిష్కరానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్శింహ శాసన మండలి లో వెల్లడి సంగారెడ్డి జిల్లా/ నమస్తేర్/ జనవరి 3 / ఆందోల్ నియోజకవర్గ రిపోర్టర్ నాగరాజు శాసన మండలి లో రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ RMP /PMP లపై గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలిపారు. పేదవారి ఆరోగ్య భద్రత ప్రభుత్వ బాధ్యత అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య , ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేస్తున్నామన్నారు. రాష్ట్ర విద్య , వైద్య శాఖల…
సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వారు సేవలు మరువలేనివి.మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆమె సేవలు చిరస్మరణీయం.సంగారెడ్డి జిల్లా/ నమస్తే ఇందూర్ / జనవరి 3 / ఆందోల్ నియోజకవర్గం రిపోర్టర్ నాగరాజు నెహ్రూ మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జోగిపేట యందు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.పి .రమేష్ సార్ గారి అధ్యక్షతన, ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో *సావిత్రిబాయి పూలే గారి 195 వ* జయంతి సందర్భంగా *మహిళా ఉపాధ్యాయుల* దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ముందుగా కళాశాలలోని మహిళా అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సావిత్రిబాయి పూలే వంటి వారిని ఆదర్శంగా తీసుకొని చదువుతోపాటు అన్ని రంగాలలో నైపుణ్యాన్ని సాధిస్తూ మహిళలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలియజేయడం జరిగింది. మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులకు *వ్యాసరచన మరియు ఉపన్యాస* పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకుల చేత విద్యార్థులకు…
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్)
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్)* జహీరాబాద్ ప్రతినిది నమస్తేఇందుర్ జనవారి3 అఖిల్ రిపోర్టర్ ఆర్‌సి ఇంచార్జ్ జహీరాబాద్ లో భారీ పారిశ్రామిక పనులు వేగవంతం నిమ్స్ ప్రాజెక్ట్ చుట్టుపక్కల 50 కిలోమీటర్ల వరకు భూముల ధరలకు రెక్కలు* గతంలో ఒక ఎకరం భూమి లక్షలాల్లో ఉంటే 2026 నూతన సంవత్సరం సందర్భంగా భూముల రేట్లు కోట్లల్లో పలుకుతున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు పెట్టుబడి అడ్డగా మారుతున్న జహీరాబాద్ ప్రాంత భూములు* గత రెండు సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భూములు కొనుగోలు గాని అమ్మకాలు గానీ జరగలేదు కానీ జహీరాబాద్ ప్రాంతంలో నిమ్స్ పనులు పూర్తిగా ప్రారంభం కావడం వల్ల ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు పెట్టుబడి దార్లకు మంచి శుభ సూచికం ఈ ప్రాంత ప్రజలు తెలుపుతున్నారు జహీరాబాద్ ప్రాంతంలో లక్షలాది మందికి ఉపాధితో పాటు చిన్న చిన్న వ్యాపారస్తులకు మరియు పెట్టుబడిదారులకు జహీరాబాద్ ప్రాంతం సరైన అడ్డగా…
సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా సింగూర్ గురుకులంలో ప్రిన్సిపల్ ఆగమయ్య TSUTF సూపరిండెంట్ చేతులు మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ.సింగూరు గురుకులంలో ప్రిన్సిపాల్ ఆగమయ్య, సూపరిండెంట్ గంగాధర్ చేతుల మీదుగా TSUTF క్యాలెండర్ ఆవిష్కరణ సంగారెడ్డి జిల్లా/ నమస్తే ఇందుర్/ జనవరి 3/ అందోల్ నియోజవర్గం రిపోర్టర్ నాగరాజుపుల్కల్: సావిత్రి బా య్ పూలే జయంతి సందర్భంగా సింగూర్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ను సింగూర్ ప్రిన్సిపాల్ ఆగమయ్య, సూపరిండెంట్ గంగాధర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న TSUTF ను కొనియాడారు. ఈకార్యక్రమంలో TSUTF పుల్కల్ మండల ప్రధాన కార్యదర్శి తేరటి నరసింహ , కార్యదర్శి బొమ్మ శ్రీనివాస్, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.








