Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- తుల్జాభావాని ఆరవ వార్షికోత్సవం కు ఆహ్వానం(మత పార్వతమ్మ)
- నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
- రాజీ మార్గమే రాజ మార్గం
- యువకులు క్రీడలపట్ల ఆసక్తిని కనబర్చాలి: కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్
- పుల్కల్ గ్రామంలో జోరుగా సాగుతున్న అభివృద్ధి పనులు
- టీబీ రహిత జిల్లాయే లక్ష్యం
- అక్రమ ఇసుక తరలింపు లారీ పట్టివేత..
- సుల్తాన్పూర్ జేఎన్టీయూలో విద్యార్థుల డాన్స్
Author: నమస్తే ఇందూర్
హనుమకొండ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తతవిద్యాసంఘాలపై పోలీసుల దౌర్జన్యంపై వామపక్ష విద్యార్థి సంఘాల ఆగ్రహంనమస్తే ఇందూర్: హనుమకొండ, హనుమకొండ జిల్లా పరిధిలోని విద్యా రంగ సమస్యలను చర్చించేందుకు 20వ తేదీ మూడు గంటలకు వామపక్ష విద్యార్థి సంఘాల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. కలెక్టర్ సీసీ “అరగంటలో కలుస్తాం” అని చెప్పినప్పటికీ, సాయంత్రం 6 గంటలు దాటినా కూడా విద్యార్థి సంఘాలను కలవకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కలెక్టర్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థి సంఘాలపై పోలీసులు అనవసరంగా దౌర్జన్యానికి పాల్పడ్డారని సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థులను ఈడ్చిపడేసి, కొట్టి, అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్టు తెలిసింది. జిల్లాలో ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థల ప్రయోజనాల కోసం కలెక్టర్ పోలీసులను ఉపయోగించి వామపక్ష విద్యార్థి సంఘాలపై దాడికి ప్రోత్సహించారని విద్యార్థి నాయకులు విమర్శించారు. విద్యార్థుల వినతిపత్రం కూడా స్వీకరించకపోవడం ప్రజాస్వామ్యంపై దెబ్బ అని పేర్కొన్నారు. “ప్రజాస్వామ్యం ఉన్న రాష్ట్రం అని…
సింగూర్ సాంఘిక సంక్షేమ హాస్టల్లో నుండి అగ్నివీర్ గా ఎంపికైన సింగూర్ సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థి శివ కుమార్. సంగారెడ్డి జిల్లా/ఇల్కల్ మండలం/నమస్తే ఇందూర్/నవంబర్ 19. కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్. హనుమకొండలో జరిగిన ఆర్మీ ర్యాలీలో సింగూర్ సాంఘిక సంక్షేమ పాఠశాలలో ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో చదువుతున్న శివకుమార్ అనే విద్యార్థి అగ్ని వీర్ గా ఎంపికయ్యాడు. తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ఆర్మీకి ఎంపిక కావడం పట్ల ప్రిన్సిపల్ ఆగమయ్య, క్రీడల్లో తీర్చిదిద్దిన PD కృష్ణ, ఉపాధ్యాయ బృందం సంతోషం వ్యక్తం చేసి విద్యార్థిని అభినందించారు.69వ SGF రాష్ట్రస్థాయిలో….సత్తా చాటిన సింగూర్ గురుకులం 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్లోనూ ఓవరాల్ ఛాంపియన్ సింగూరే. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో సింగూరు గురుకులం విద్యార్థులు సత్తా చాటారు. యాదాద్రి భువనగిరిలో జరిగిన వాలీబాల్ అండర్ 19 విభాగంలో అజయ్ కుమార్, ప్రణయ్ లు తమ ప్రతిభను కనబర్చగా జింఖానా…
మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌లో హతం ఆంధ్ర–తెలంగాణ సరిహద్దుల్లో భద్రతా దళాల భారీ ఆపరేషన్ నమస్తే ఇందూర్: అల్లూరి జిల్లా ఆంధ్రప్రదేశ్–తెలంగాణ సరిహద్దులోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం భద్రతా దళాలు పెద్ద ఎన్‌కౌంటర్ చేపట్టాయి. ఇందులో మావోయిస్టుల అగ్రనేత మద్వి హిడ్మా, ఆయన భార్యతో పాటు ఆరుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. హిడ్మా ఎవరు? హిడ్మా మావోయిస్టులలో అత్యంత ప్రధాన నాయకుడు. గతంలో భద్రతా దళాలపై జరిగిన పలు పెద్ద దాడుల్లో ఆయన ప్రధాన పాత్ర వహించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆయనపై ప్రభుత్వాలు భారీ రివార్డులు ప్రకటించాయి. ఎన్‌కౌంటర్ వివరాలు ఉదయం నక్సలైట్ల కోసం గాలిస్తున్న ప్రత్యేక దళాలపై మావోయిస్టులు కాల్పులు ప్రారంభించడంతో ప్రతిగా దళాలు ఎదురుకాల్పులు చేపట్టాయి. కొన్ని గంటలపాటు సాగిన కాల్పుల సంఘటనలో హిడ్మా సహా పలువురు మావోయిస్టులు మృతి చెందగా, అక్కడి నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.…
వయోవృద్ధుల సంరక్షణ చట్టంపై అవగాహన అవగాహన కల్పించిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ నమస్తే ఇందూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవంబర్ 17 సోమవారం శ్రీ సత్య సాయి సమాజ సేవా ట్రస్ట్, రైటర్ బస్తీ కొత్తగూడెం లో జిల్లా న్యాయ సేవాదికార సంస్థ, కొత్తగూడెం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమం లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ ముఖ్య అతిధిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతు తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం, 2007 యొక్క ప్రయోజనాలు మరియు అమలు గురించి ప్రజలకు అవగాహన కల్పించవల్సిన అవసరం ఉందని తెలిపారు.వృద్ధుల సంరక్షణ, పోషణ మరియు వారి ఆస్తుల రక్షణ కోసం ఈ చట్టం కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని అన్నారు. వృద్ధులను వారి కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేసినా, వేధించినా, ఈ చట్టం వారికి రక్షణ కల్పిస్తుందని చెప్పారు. తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్‌లను…
సమయపాలన పాటించని అంగన్వాడి టీచర్…..! నమస్తే ఇందూర్. కే మధుకర్. బోధన్ ప్రతినిధి. 15 నవంబర్కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలంలోని లింబూర్ గ్రామంలో గల ఎస్సీ కాలనీలో గల అంగన్వాడి కేంద్రంలో నిధులు నిర్వవలిసిన టైం మార్నింగ్ 09: నుంచి సాయంత్రం 4:00 వరకు కని అంగన్వాడి టీచర్ మాత్రం టైం కాకముందే తాళంవేసి వెళ్లిపోవడం అంగన్వాడి కేంద్రానికి వచ్చిన పిల్లలు, తల్లిదండ్రులు,తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు తన నిర్లక్ష్యం వైఖరి వీడి సమయపాలన పాటించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు,
తడి హిప్పర్గ గ్రామంలో గ్రామ సభ కార్యక్రమం.నమస్తే ఇందూర్. కాంబ్లె మధుకర్. బోధన్ ప్రతినిధి. 15 నవంబర్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం తడి హిప్పర్గ గ్రామంలో ఈరోజు గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామ పంచాయతీ కార్యదర్శిని జ్యోతి జాదవ్, సూపర్ వైజేర్ దేవుకర్ణ. జయశ్రీ. సునీత.శిటల్.వామనరావు. రాజు. దత్తు.కే రాజు. విశ్వజిత. బాలు.ప్రాల్హాద్. సంజయ్ తెలిపారు, ఈ గ్రామ సభలో అంగన్వాడి భవనం ప్రైమరీ వి స్కూల్ పక్కన ఉన్న కలి స్థలంలో నిర్మాణం చేయాలని సభ్యులందరూ, చర్చించి తీర్మానంచి. రాయడం జరిగిందని గ్రామ పెద్దలు. తెలిపారు,
అత్తింటి వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్సంగారెడ్డి నవంబర్ 16 నమస్తే హిందూర్ అందోల్ కాంసెన్సీ ప్రతినిధి సత్యం రిపోర్టర్అందోల్ కాంసెన్సీ పుల్కల్ మండలం లోని పెద్దరెడ్డిపేట గ్రామంలో అత్తింటి వేదింపులు భరించలేక ఓ వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్న సంఘటన ఘటన పుల్కల్ పోలిస్ స్టేష న్ పరిధిలో శనివారం జరిగింది. ఏఎస్ఐ వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలోని బిజిలిపూర్ గ్రామా నికి చెందిన లక్ష్మి (26) ని 20 నెలల క్రితం పుల్కల్ మండలంలోని పెద్దారెడ్డిపేట గ్రామానికి చెందిన పట్నం ప్రవీణితో వివాహం చేశారు. వివాహ సమయంలో రూ. 9 లక్షల నగదు, బంగారం, ఇతర సామాగ్రి వర కట్నంగా అందజేశారు. వీరి కాపురం 4 నెలల పాటు సాఫీగాసాగింది. ఆ తర్వాత నుండి అదన పు కట్నం తీసుకురావలని, భర్తతో పాటు అత్తమామలు లక్ష్మిని శారీర కంగా, మానసీకంగా వేదిండం…
*జూనియర్ అసిస్టెంట్ ని బెదిరించి మరీ రైతుల పై కేసులు పెట్టించిన అధికారులు..* *ఇందూరు వార్త / నవంబర్ 13 / కోటగిరి, పొతంగల్:* పొతంగల్ మండల కేంద్రంలోని సోమవారం 10వ తేదీ, నాడు అక్రమ ఇసుక రవాణా పై రైతులు చేసిన ధర్నాని మండల అధికారులు మనసులో పెట్టుకొని స్పాట్లో లేని జూనియర్ అసిస్టెంట్ తో బాధితులపై , అక్రమంగా కేసులు పెట్టించడం ఎంత వరకు సమంజసమని , ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం పోతంగల్ మండల కేంద్రంలోని సాయిబాబా మందిరం కళ్యాణ మండపంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా బాధితులు మాట్లాడుతూ…అనుమతుల పేరుతో అక్రమ ఇసుక రవాణా, ఓవర్ లోడ్ తో వెళ్తూ ప్రజలు ఇబందులు పడుతుంటే గ్రామస్తులు, రైతులు ఆపినందుకు అక్రమ కేసులు చేయటం ఏంటని ఆరోపించారు. పోతంగల్ మండలంలోని కోడిచెర్ల శివారులో మంజీరాలో రైతుల పొలాల్లో నుంచి ఇసుకను తీయడానికి పట్టా భూమిలో కిలోమీటర్ల దూరం…
కార్తీక పౌర్ణమికి ప్రగతి నగర్ శివాలయంలో భక్తుల రద్దీ:నమస్తే ఇందూర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవంబర్ 5 కొత్తగూడెం సంస్కృతికం:: కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రగతినగర్ శివాలయంలో బుధవారం కొత్తగూడెం స్పెషల్ జ్యూడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు, కొత్తగూడెం 3 టౌన్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్, ఏ.ఎస్.ఐ. బి.వి.ఆర్.రఘు ,పిసి భూక్యా జయాత్రo, మద్దినేని వెంకటేశ్వర్లు,చౌరంగి శ్రీనివాస్, జడల కోటేశ్వరరావు లకు ఆలయ పూజారి కొండవీటి దత్తాత్రేయ శర్మ ఆశీర్వచనములు అందజేశారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్క్కు లు తీర్చుకున్నారు
సోయా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుజుక్కల్ ప్రతినిధి నాగభూషణం, నమస్తే ఇందూర్,03, సెప్టెంబర్పిట్లం,జుక్కల్,బిచ్కుంద మరియు డోంగ్లీ మండల కేంద్రాల్లో సోయా కొనుగోలు కేంద్రాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు.సోయా ధాన్యానికి క్వింటాలుకు రూ.5,328/- ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని చెప్పారు..ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దు అని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు గారు విజ్ఞప్తి చేశారు..










