Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- తుల్జాభావాని ఆరవ వార్షికోత్సవం కు ఆహ్వానం(మత పార్వతమ్మ)
- నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
- రాజీ మార్గమే రాజ మార్గం
- యువకులు క్రీడలపట్ల ఆసక్తిని కనబర్చాలి: కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్
- పుల్కల్ గ్రామంలో జోరుగా సాగుతున్న అభివృద్ధి పనులు
- టీబీ రహిత జిల్లాయే లక్ష్యం
- అక్రమ ఇసుక తరలింపు లారీ పట్టివేత..
- సుల్తాన్పూర్ జేఎన్టీయూలో విద్యార్థుల డాన్స్
Author: నమస్తే ఇందూర్
నారాయణఖేడ్ పట్టణంలోని సమావేశ మందిరము భోజనశాల మరియు వంట గది నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శేట్కర్ గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి నమస్తే ఇందూర్ , నారాయణఖేడ్ సెప్టెంబర్ 05 నారాయణఖేడ్ మండల పరిధిలోని జుక్కల్ శివారులోని నారాయణఖేడ్ పట్టణంలోని సమావేశ మందిరము భోజనశాల మరియు వంట గది నిర్మాణనికి 1.15 కోట్ల రూపాయలతో మంజూరైన సందర్భంగా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శేట్కర్ , నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రశేకర్ సబ్ కలెక్టర్ ఉమ హారతి ఈ కార్యక్రమంలో వారితోపాటు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, పట్లోళ్ల సుధాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్…
భీమారంలో వినాయకుని పూజల్లో ఎమ్మెల్యే కేఆర్. నాగరాజునమస్తే ఇందూర్: హన్మకొండ, సెప్టెంబర్ 4 :శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భీమారంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గడ్డం శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో జి.ఎస్.ఆర్ టీమ్, రేణుక ఎల్లమ్మ తల్లి గజానన యూత్ కమిటీ ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో ఈ వేడుక జరిగింది. ప్రధాన అతిథులుగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు, వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్. దిలీప్ రాజ్ హాజరయ్యారు. అనంతరం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, “గణనాథుడి ఆరాధనతో ప్రతి ఇంట సంతోషం, ఐశ్వర్యం, అభివృద్ధి నిండాలని కోరుకున్నా. ఈ పండుగ భక్తి, శక్తి మాత్రమే కాకుండా ఐకమత్యం, స్నేహభావాన్ని పెంపొందిస్తుంది” అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను ప్రతిష్టించడం ఆనందదాయకమని తెలిపారు. యువత సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజానికి మార్గదర్శకులుగా…
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 23 మంది గురువులకు ఘన సన్మానంనమస్తే ఇందూర్: గీసుగొండగ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ గొర్రెకుంట ప్రైమరీ, సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు క్లెమెంట్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించగా గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు, విద్యా అభిమానం కలిగిన పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 23 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాట్లాడిన క్లెమెంట్ మాదిగ మాట్లాడుతూ, “భారతదేశపు తొలి ఉపరాష్ట్రపతి, రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టిన రోజు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. ఉపాధ్యాయ వృత్తి ఒక పుణ్యవృత్తి. విద్యార్థులా నిరంతరం నేర్చుకుంటూ, భవిష్యత్ తరాలను విద్యావంతులుగా తీర్చిదిద్దే వారు నిజమైన గురువులు” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 15వ డివిజన్ బీజేపీ అధ్యక్షులు ల్యాదల్ల ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ పోలేపాక సుమన్, కాంగ్రెస్ పార్టీ…
వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మర్రి మొక్క నాటిన వనప్రేమికుడు సమ్మయ్యనమస్తే ఇందూర్: నెక్కొండ జాతీయ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా నెక్కొండ మండల కేంద్రంలోని మర్రికొమ్మ వద్ద గ్రీన్ ఇండియా ఛాలెంజ్, జీవ వైవిధ్య అవార్డు గ్రహీత వనప్రేమికుడు నల్లగొండ సమ్మయ్య మర్రి మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మనిషి మనుషులను ప్రేమించడం మానవత్వం, వన్యప్రాణులను ప్రేమించడం దైవత్వం. పర్యావరణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, చెట్లను సంరక్షించాలి” అని పిలుపునిచ్చారు. తాను నాటిన మొక్కలు చెట్లుగా పెరగడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. నాటి మొక్కలు, నేటి మొక్కలన్నీ వటవృక్షాలుగా పెరిగి మానవాళి, వన్యప్రాణి జీవకోటికి ఆవాసం కల్పించాలని భగవంతుని ప్రార్థించారు.
నాలుగు కోట్లు విలువైన భవంతిని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామికి విరాళనమస్తే ఇందూర్: హైదరాబాద్, సెప్టెంబర్ 4:హైదరాబాద్ తిలక్‌నగర్‌కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ముత్తినేని వెంకటేశ్వర్లు దాదాపు నాలుగు కోట్ల రూపాయల విలువైన ఇంటిని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి విరాళంగా అందజేశారు. గురువారం చిక్కడపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈవో వెంకట్రావు సమక్షంలో దేవుడి పేరుతో ఆస్తి రిజిస్ట్రేషన్ చేశారు. 152 గజాల విస్తీర్ణంలో నిర్మించిన జీ+3 భవనం, పెంట్‌హౌస్‌ను సహా స్వామివారికి సమర్పించారు. తరువాత ఈవో వెంకట్రావు, దేవస్థాన చైర్మన్ నరసింహమూర్తి, ఇతర అధికారులు దాతను సన్మానించారు. స్వామివారి ప్రసాదం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దాతను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రిన్స్‌పాల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ప్రత్యేకంగా అభినందించారు.
పెద్దగోపులారం గ్రామంలో గణపతి నిమార్జన మహోత్సవంసంగారెడ్డి సెప్టెంబర్ 04 (నమస్తే ఇందూర్) మునిపల్లి మండలంలోని పెద్దాగోపులారం గ్రామంలో వినాయక నవ రాత్రులు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు అను నిత్యం వేదపండితులచే ఉదయం సాయంత్రం వేళల్లో దంపతులచే పూజ కార్యక్రమలు ఘనంగా నిర్వహించారు. నవరాత్రులు పురస్కరించుకొని అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన మండపము వద్ద మొదటి రోజు నుండి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కుటుంబసమేతంగా పూజలో పాల్గొన్నారు. బ్యాబారి రామయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తొమ్మిదవ రోజు వినాయక పూజలు చేసి నిమర్జనం వాహనాన్ని ముస్తాబ్ చేసి భాజా భజంత్రీలతో చిన్నపిల్లలకు కోలాటాలు వాడుతూ రంగ రంగ వైభవంగా తిరుగుతూ వినాయకుడిని గొర్రెగటు బుగ్గరమణ చెరువు సమీపంలోకి తీసుకెళ్లి నిమజ్జనం ఘనంగా చేశారు. అంబేద్కర్ యూత్ సభ్యులు మాట్లాడుతూ పెద్ద గోపులారం గ్రామ ప్రజలు ఎల్లవేళల సుఖసంతోషాలతో ఉండాలని మీ వినాయకుని కోరుకున్నామని ప్రతి…
పెద్దారెడ్డిపేట్ గ్రామంలో గణపతి నిమార్జన మహోత్సవంసంగారెడ్డి సెప్టెంబర్ 04 (నమస్తే ఇందూర్) పుల్కల్ మండలంలోని పెద్దారెడ్డి పెట్ గ్రామంలో వినాయక నవ రాత్రులు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు అను నిత్యం వేదపండితులచే ఉదయం సాయంత్రం వేళల్లో దంపతులచే పూజ కార్యక్రమలు ఘనంగా నిర్వహించారు. నవరాత్రులు పురస్కరించుకొని మల్లికార్జున యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన మండపము వద్ద మొదటి రోజు నుండి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కుటుంబసమేతంగా పూజలో పాల్గొన్నారు. మల్లికార్జున యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తొమ్మిదవ రోజు వినాయక పూజలు చేసి నిమర్జనం వాహనాన్ని ముస్తాబ్ చేసి భాజా భజంత్రీలతో చిన్నపిల్లలకు కోలాటాలు వాడుతూ రంగ రంగ వైభవంగా తిరుగుతూ వినాయకుడిని సింగూర్ ప్రాజెక్ట్ సమీపంలోకి తీసుకెళ్లి నిమజ్జనం ఘనంగా చేశారు. మల్లికార్జున యూత్ సభ్యులు మాట్లాడుతూ పెద్ద రెడ్డి పేట్ గ్రామ ప్రజలు ఎల్లవేళల సుఖసంతోషాలతో ఉండాలని మీ వినాయకుని కోరుకున్నామని…
అందోల్ లో విద్యా ప్రగతికి పెద్దపీట దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిప్రభుత్వ విద్యాసంస్థల్లో పారిశుధ్య కార్యక్రమాల్లో మున్సిపల్ సిబ్బంది భాగస్వామ్యం చేయాలిఅందోల్,చౌట్కూర్ మండలాలలోరూ.31.24 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి దామోదర్సంగారెడ్డి సెప్టెంబర్ 04 నమస్తే ఇందూర్ :- అందోల్ నియోజకవర్గం లో విద్యా ప్రగతి పెద్ద పీఠ వేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. గురువారం ఆందోల్, చౌటకూర్ మండలాల లోని పలు అభివృద్ధి , సంక్షేమ , ప్రభుత్వ విద్యాసంస్థలలో రూ. 31.24 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా తో మాట్లాడారు రాష్ట్రంలో అందోల్ నియోజకవర్గాన్ని విజ్ఞాన భాండాగారం గా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల విద్యాసంస్థలు రానున్న మూడు సంవత్సరాల్లో దశల వారీగా పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు మంత్రి తెలిపారు.విద్యాసంస్థల లో కావలసిన మౌలిక వసతుల కల్పన…
సబ్ రిజిస్టార్ ఆదాయానికి సర్వర్ సమస్య గండి కొట్టిందా …..?• ఎంత పనిచేసిందే…. నెట్వర్క్..?నమస్తే ఇందూర్,కామారెడ్డి సెప్టెంబర్ 03,కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నెట్వర్క్ సమస్యతో బుధవారం ఒక్క డాక్యుమెంట్ కూడా రిజిస్ట్రేషన్ కాకపోవడంతో లావాదేవీలు ఒక్కసారిగా ఆగిపోవడముతో వినియోగదారులు తిరుగుమొహం పట్టారు.కొంపముంచిన ….వాన…సామాన్యులకే కాదు వర్షం …సబ్ రిజిస్టార్ కార్యాలయానికి కూడా నష్టాన్ని కలిగించినదని ప్రజలు అంటున్నారు.వర్షాల కారణంగా నెట్వర్క్ కేబుల్స్ పాడైపోవడముతో సమస్య తలెత్తిందని డాక్యుమెంట్ రైటర్ లు గుసగుసలాడుతూ సబ్ రిజిస్టార్ కార్యాలయం ముందు నెట్ వర్క్ ఎపుడస్తుందో అని వేయి కళ్ల తో ఎదురుచుతు పడిగాపులు కాస్తున్నారు.కొసమెరుపు….ఒక్క డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కాకపోవడంతో వాన కొంపముంచిందనీ రిజిస్ట్రేషన్ చేసేవారి రోజు వారి ఆదాయానికి గండి పడిందని సదరు అధికారి బాధపడ్డట్లు విశ్వసనీయ సమాచారం…









