అక్రమ ఇసుక తరలింపు లారీ పట్టివేత..
జహీరాబాద్ /న్యాల్కల్ /మర్చి 24(నమస్తే ఇందూర్ ప్రతినిధి ):-
న్యాలకల్ మండలం పరిధిలోని హద్నూర్ మండలంలో అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతుండగా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ఒక లారీని పట్టుకున్నారు.తెల్లవారుజామున సుమారు 00:30 గంటల సమయంలో హద్నూర్ దోమ సుజిత్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు.జహీరాబాద్ నుండి బీదర్ వైపు అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న టీఎస్ 05 యుసి 7327 నంబరు గల లారీని గుర్తించి ఆపివేశారు. పరిశీలనలో అవసరమైన పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు తేలింది.దీనితో వెంటనే లారీని స్వాధీనం చేసుకుని హద్నూర్ పోలీసు స్టేషన్కు తరలించారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
