ఎన్నికల కోడ్ సందర్భంగా కిరాణా షాపు లో మద్యం సీజ్ కేసు నమోదు
అచ్చంపేట తాలూకా పరిధిలోని సంఘటన
నమస్తే ఇందూర్, రిపోర్టర్ పంబ శంకర్
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట తాలూకా పరిధిలో లింగాల గ్రామంలో ఉన్న కొనేటి వెంకటస్వామి నడిపిస్తున్నా జనరల్ కిరాణా షాపు పై పోలీసులు సడెన్ రైడ్ నిర్వహించి అనధికార మద్యం సీజ్ చేశారు. స్టేషన్ కి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ ఆధ్వర్యంలో దాడి చేయగా, షాపు లో వివిధ బ్రాండ్ లకు చెందిన మద్యం సిసాలను అనమతి లేకుండా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. అందాజా రుపాయలు 5000/- విలువ కలిగిన మద్యం ను స్వాధీనం చేసుకుని సంబందిత యజమాని కొనేటి వెంకటస్వామి ని అదుపులోకి తీసుకుని ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక ఎన్నికల సందర్భంగా మద్యం, బీరు లాంటి మద్యం అక్రమ రవాణా, నిల్వలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తప్పు చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు.


