చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
జుక్కల్ ఆర్సీ సెప్టెంబర్ 6 నమస్తే ఇందూర్
జుక్కల్ నియోజకవర్గంలో నిజాం సాగర్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సి యం ఆర్ యఫ్ చెక్కులను పంపిణీ చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు.. నిజాంసాగర్ మండల కేంద్రంలోని శనివారం రోజు నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల లబ్ది దారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పంపిణీ చేశారు..అదేవిధంగా అనారోగ్యంతో ఆసుపత్రులలో చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని(CMRF చెక్కులు) అందజేశారు..వాటితో పాటు లబ్ది దారులకు కొత్త రేషన్ కార్డులు కూడా అందజేశారు.. ఈ కార్యక్రమంలో మండలాల అధ్యక్షులు మల్లికార్జున్,రవీందర్ రెడ్డి,పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్, నాయకులు ఆకాష్, అనీస్,అజహారుద్దీన్,అధికారులు,కాంగ్రెస్ కార్యకర్తలు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


