జాగృతి నాయకుల ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ పై నిరసన కార్యక్రమం
నమస్తే ఇందూర్ బిచ్కుంద
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని జుక్కల్ చౌరస్తా వద్ద తెలంగాణ జాగృతి నాయకులు బిసి రిజర్వేషన్ కొరకు నిరసన కార్యక్రమం తెలియజేసి దుకాణాలను బందు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు. అధిక జన సంఖ్య ఉన్న బీసీలకు రిజర్వేషన్ కల్పించడంపై ప్రభుత్వాలు మొండి వైగిరి మానుకోవాలన్నారు. రిజర్వేషన్ కల్పించకుంటే జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ మొత్తం రాస్తారోకోలు, ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి జుక్కల్ నియోజకవర్గ ఇన్చార్జ్ రాజశేఖర్, రాష్ట్ర నాయకులు ఉడుత వార్ సురేష్ గౌడ్, బాల్రాజ్ సార్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్ష్మణ్, ఆదిల్, రవీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.


