పుల్కల్ జడ్పిహెచ్ఎస్ స్కూల్లో పూర్వ విద్యార్థులు ఎన్నో ఏళ్లకు కలుసుకోవడం జరిగింది
పుల్కల్
సంగారెడ్డి జిల్లా/పుల్కల్ మండలం/నమస్తే ఇందూర్/మార్చి 23 . కిట్టు రిపోర్టర్ పుల్కల్ మండలం లో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు పై చదువులకోసం (ఇంటర్మిడియేట్)సంగారెడ్డి లో చదువుకున్నారు. అప్పుడు కలుసుకున్న స్నేహితులు చాలా ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరి, మెదక్ జిల్లా నల్ల పోచమ్మ దేవాలయం దగ్గర అందరు కాలుకున్నారు. అక్కడ అమ్మవారికి మొక్కులు తీర్చుకొని తమ పాత జ్ఞాపకాలను, మధుర క్షణాలను నెమరువేసుకోవడమే “పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక” ఇది పాత మిత్రులను కలుసుకోవడం, గురువులను సన్మానించుకోవడం, పాఠశాల/కళాశాల దినాలను గుర్తుచేసుకుంటూ ఆత్మీయంగా గడపడం,పూర్వ విద్యార్థుల కలయిక
పదహారు సంవత్సరాల తర్వాత కూడా పాత స్నేహితులు కలుసుకుని, చిన్నపిల్లల్లా ఆడుతూ పాడుతూ ఆనందాన్ని పంచుకున్నారు, తమకు చదువు చెప్పిన పాఠశాల అభివృద్ధికి, అవసరమైన సదుపాయాల కల్పనకు తమవంతు సహాయ సహకారాలను (డొనేషన్లు) అందిచాలని అనుకున్నమని అన్నారు,ఈ కలయికలు మనుషుల మధ్య బంధాలను మరింత బలోపేతం చేస్తాయి ఎప్పటి ఒకేలా ఉండి నలుగురికి సహాయం చేసే విదంగా ఉండాలని అలాగే ఉంటాం అని అన్నారు.
