పెద్దగోపులారం గ్రామంలో గణపతి నిమార్జన మహోత్సవం
సంగారెడ్డి సెప్టెంబర్ 04 (నమస్తే ఇందూర్) మునిపల్లి మండలంలోని పెద్దాగోపులారం గ్రామంలో వినాయక నవ రాత్రులు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు అను నిత్యం వేదపండితులచే ఉదయం సాయంత్రం వేళల్లో దంపతులచే పూజ కార్యక్రమలు ఘనంగా నిర్వహించారు. నవరాత్రులు పురస్కరించుకొని అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన మండపము వద్ద మొదటి రోజు నుండి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కుటుంబ
సమేతంగా పూజలో పాల్గొన్నారు. బ్యాబారి రామయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తొమ్మిదవ రోజు వినాయక పూజలు చేసి నిమర్జనం వాహనాన్ని ముస్తాబ్ చేసి భాజా భజంత్రీలతో చిన్నపిల్లలకు కోలాటాలు వాడుతూ రంగ రంగ వైభవంగా తిరుగుతూ వినాయకుడిని గొర్రెగటు బుగ్గరమణ చెరువు సమీపంలోకి తీసుకెళ్లి నిమజ్జనం ఘనంగా చేశారు. అంబేద్కర్ యూత్ సభ్యులు మాట్లాడుతూ పెద్ద గోపులారం గ్రామ ప్రజలు ఎల్లవేళల సుఖసంతోషాలతో ఉండాలని మీ వినాయకుని కోరుకున్నామని ప్రతి సంవత్సరం వినాయకుడి పూజలు ఘనంగా నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమం చేస్తూ ముందుకు వెళ్తామని తెలియజేశారు.ఈ నిమజ్జన కార్యక్రమంలో ఎంపిటిసి పాండు , మునిపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బి రాజు దప్పుమోహన్ బేగారిమణిక్యం బూర్కల శంకరయ్య చంద్రయ్య గ్రామ పెద్దలు మరియు లింగాయత్ యూత్ పెద్దలు ,గ్రామ ప్రజలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


