భారీ వర్షాలు కురుస్తున్నందున యెల్దుర్తి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
-ప్రతి క్షణం యెల్దుర్తి బీజేపీ మండల శాఖ సూచన
మెదక్ జిల్లా వ్యాప్తంగా వెల్దుర్తి మండల వ్యాప్తంగా రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వెల్దుర్తి పట్టణం పూర్తిగా జలదిగ్బంధమైంది. పోలీస్ సిబ్బంది గ్రామ సిబ్బంది అప్రమత్తమై నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ప్రజలకు ఏదైనా అత్యవసరం అయితే 100 నంబర్ కు ఫోన్ చేయగలరు.పట్టణంలోని చెరువులు కుంటలు, కాలువలు అన్ని కూడా నిండుగా ప్రవహిస్తున్నందున పట్టణంలోని ప్రజలు యువకులు ప్రతి ఒక్కరు కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదని వెల్దుర్తి వార్డు సభ్యుడు మాజీ బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.

