మహాశివరాత్రి పర్వదినాన రోడ్డు ప్రమాదం… ఒకరి మృతి
చికిత్స నిమిత్తం అచ్చంపేట ఆసుపత్రికి తరలింపు
నమస్తే ఇందూర్, ఉప్పునుంతల మండల రిపోర్టర్ పి హన్మంత్ , నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రధాన రహదారిపై మహాశివరాత్రి పర్వదినం రోజు విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. అచ్చంపేట-మన్ననూర్ ప్రధాన రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. అచ్చంపేట మండలం బోల్గాట్ పల్లి గ్రామం వద్ద ఉన్న చంద్ర సాగర్ వంతెన సమీపంలో అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (టీజీ 31 జెడ్ 0057) ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైకు నడుపుతున్న మహంకాళి మహేష్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక భాగంలో కూర్చున్న పల్లవి తీవ్రంగా గాయపడగా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎస్సై సద్దాం హుస్సేన్ సంఘటన స్థలానికి చేరుకొని ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
