సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారోత్సవం లో పాల్గొన్న జగ్గారెడ్డి, టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మల
సంగారెడ్డి జిల్లా/సదాశివపేట్/నమస్తే ఇందూర్/జనవరి 10. కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్
ఆలస్యం అయిన కష్టపడితే కాంగ్రెస్ లో పదవులు దక్కుతాయనే విషయానికి సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా అలివేని నర్సింహ రెడ్డి ఉదాహరణ అని టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. సదాశివపేట పట్టణం లోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అలివేణి నర్సింహ రెడ్డి శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గారెడ్డి, నిర్మల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ రైతులకు సరైన గిట్ట బాటు ధర కల్పించడం మార్కెట్ కమిటీ బాధ్యత వహించాలన్నారు. మార్కెట్ కమిటీ లో రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉండేలా జాగ్రత్త లు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి ఆంజనేయులు,సిడిసి చైర్మెన్ రామ్ రెడ్డి, ఆత్మ చైర్మెన్ ప్రభు, సంగారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘు గౌడ్, సంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ చందర్ నాయక్ కాంగ్రెస్ నాయకులు మునిపల్లి సత్యనారాయణ ,సిద్దన్న తదితరులు పాల్గొన్నారు

