హుస్నాబాద్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో ఈరోజు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో గోడ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది
నమస్తే ఇందూర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అక్టోబర్ 28
హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ,వచ్చేనెల నవంబరు ఒకటో తేదీ నాడు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ఇబ్రం శేఖర్ అధ్యక్షతన మహా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ బీసీలకు న్యాయం జరగలేదు. అదేవిధంగా బిజెపి పార్టీ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు కు మద్దతిచ్చి, ముస్లింల పేరుతో బీసీల రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వకుండా, ప్రధానమంత్రి మోడీని ఒప్పించకుండా రాష్ట్రంలో ఉన్న ఎనిమిది మంది బిజెపి ఎంపీలు బీసీలను ఇబ్బందులు పెడుతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల చిత్తశుద్ధి లేని పార్టీగా pమారింది. గతంలో భారతదేశంలో బీసీలకు27% రిజర్వేషన్లు రావడానికి మాన్యువర్ కాన్సిరాం పోరాటం వల్లే వచ్చిన విషయం రాష్ట్రంలో ఉన్న బీసీలు ఆలోచన చేయాలి. ఎప్పుడు బీసీల కొరకు కొట్లాడే బహుజన సమాజ్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తెస్తే బహుజనులకు బీసీలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. నవంబర్ ఒకటో తేదీన జరిగే మహాధర్నా కార్యక్రమానికి బహుజనులు పెద్ద ఎత్తున రావాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది.

